High Court : ప్రజల్ని ఏరా,పోరా,ఏమే..అని అనటానికి వీల్లేదు : పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

ప్రజల్ని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని కేరళ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రజల్ని ఏరా, పోరా, ఏంటే, ఏమే అని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని హెచ్చరించింది.

High Court : ప్రజల్ని ఏరా,పోరా,ఏమే..అని అనటానికి వీల్లేదు : పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

Not To Use 'edi Or Eda' Hc Direction

High Court : సాధారణంగా పోలీసులు అంటే దురుసుగా వ్యవహరించటం..ప్రజల్ని అగౌరవంగా మాట్లాడటం చూస్తుంటాం.వింటుంటాం.ఏంట్రా ఏంటీ గొడవ..ఆడేడీ? ఏరా అంటూ మాట్లాడతారు. మహిళలని కూడా చూడకుండా ఏంటే? ఏమే అని మాట్లాడటంకూడా విన్నాం.కానీ ఇకనుంచి ప్రజల్ని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని కేరళ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రజలతో పోలీసులు సవ్యమైన భాషలోనే మాట్లాడాలని..ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించింది.

Read more : Murder Case : శ్రీరంగాపురం హత్య కేసులో నిందితుడు అరెస్ట్

దీంతో కేరళ డీజీపీ అనిల్ కాంత్ తాజాగా పోలీసులందరికి ఆదేశాలు జారీ చేశారు. తమ దగ్గరకు వచ్చిన వారిని ఎడా (తెలుగురులో ఏరా)..`ఎడి`(తెలుగులో ఏమే) పోరా?ఏంట్రా, లాంటి అగౌరవ పదాలను ఉపయోగించవద్దని సూచించారు. పోలీసులు ప్రవర్తనను అనుక్షణం గమనించటానికి ప్రతి జిల్లాలో ఓ స్పెషల్ బ్రాంచ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ ఆదేశాలు పాటించకుండా ఇష్టానుసారం ప్రవర్తించినా..ప్రజలతో అగౌరవంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more : Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కాగా..వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో తన కూతురితో పోలీసులు అసభ్యంగా మాట్లాడారని ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఆ ప్రజలను అసభ్యంగా మాట్లాడటం ఎంత వరకు సరైంది? గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యతను మరచి వ్యవహరించటం ఎంత వరకు న్యాయం?అని ప్రశ్నిస్తు కోర్టులో పిటీషన్ వేశారు.

Read more : Asaduddin Owaisi : యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు!

ఆ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం..విచారణ చేపట్టింది.పోలీసులు ప్రజలతో సంభాషించేటపుడు గౌరవంగా వ్యవహరించాలని..మర్యాదగా మాట్లాడాలని ఆదేశించింది. `ప్రజలతో మాట్లాడేటపుడు గౌరవంగా వ్యవహరించడం పోలీసులు నేర్చుకోవాలి. `ఎడా`, `ఎడి` లాంటి పదాలతో ప్రజలను పిలిచే హక్కు పోలీసులకు లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టంచేసింది. ‘ప్రజలతో పోలీసులు గౌరవంగా మాట్లాడాలని పోలీసులకు సూచిస్తు డీజీపీ ఆదేశాలు జారీ చేయాలి`అని కేరళ హైకోర్టు సూచించింది. దీంతో పోలీసులు ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని డీజీపీ సూచించారు.