ప్రీ వెడ్డింగ్…వెడ్డింగ్ లో : CAAకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 22, 2019 / 01:16 PM IST
ప్రీ వెడ్డింగ్…వెడ్డింగ్ లో : CAAకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. అయితే సీఏఏకి వ్యతిరేకంగా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఓ జంట చేసిన వినూత్న నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన జీఎల్ అరుణ్ గోపీ,ఆశా శేఖర్ లకు పెళ్లి కుదిరింది. జనవరి-31,2020న వీరు పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే ఈ జంట తమ ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ద్వారా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు తెలుపుతూ ఓ మెసేజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సీఏఏ వద్దు..ఎన్ఆర్సీ వద్దు అని ఉన్న ఫ్లకార్డ్స్ పట్టుకుని ఫొటో షూట్ లో పాల్గొన్నారు.

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ ముఖ్యమైన విషయాన్నితమ ప్రత్యేక ఫొటోషూట్ లో భాగంగా చేసిన ఈ జంటకు హ్యాట్సాఫ్ అంటూ పలువురు నెటిజన్లు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేరళకు చెందిన మరో పెళ్లి జంట కూడా  సీఏఏకు వ్యతిరేకంగా తమదైన శైలిలో నిరసనను తెలిపారు. ఓ నవజంట పెళ్లి మండపంలో ‘నో ఎన్నార్సీ, నో సీఏఏ’ అని ప్లకార్డులు పట్టుకున్నారు.