పేరెంట్స్‌కు నెల రోజులుగా కరోనా.. ప్రాణాలకు తెగించి అన్నీ తానై చూసుకుంటున్న డాక్టర్

పేరెంట్స్‌కు నెల రోజులుగా కరోనా.. ప్రాణాలకు తెగించి అన్నీ తానై చూసుకుంటున్న డాక్టర్

ఆరు నెలల బాబు పేరెంట్స్‌కు కరోనా సోకింది. పేరెంట్స్ వైద్య పరీక్షల్లో COVID-19 పాజిటివ్ గా తేలింది. నెలల బాబుకు కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చని ఆమెను చూసుకునే వాళ్లకు కూడా వ్యాపించొచ్చని అనుమానించారు. చిన్నారి బాధ్యతను డాక్టర్ మేరీ అనితా తీసుకున్నారు. హోం క్వారంటైన్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ పేరెంట్స్ కు అప్పజెప్పేశారు.

ఎర్నాకులం జిల్లాలో ఎల్విన్ పేరెంట్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీలో నర్సులుగా పనిచేసేవారు. క్రితం నెలలో తండ్రికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. తల్లి.. పసికందు ఎల్విన్‌ను తీసుకుని వెనక్కు వచ్చేసింది. కొచ్చికి తిరుగొచ్చిన తల్లి హోం క్వారంటైన్ లో ఉండిపోయింది. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎల్విన్ సంరక్షణ చూసుకునే వారి కోసం ఎదురుచూసింది. ఇన్ఫెక్షన్ సోకుతుందేమోననే భయంతో ఎవరూ ముందుకు రాలేదు.

పాపకు సంబంధించిన కుటుంబాలు కూడా స్పందించలేదు. ‘జూన్ 14న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నన్ను అప్రోచ్ అయింది. నాకు తెలిసేటప్పటికీ పసికందు కరోనా పాజిటివ్ వచ్చిన తల్లితో చాలా రోజులుగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ అని తెలుసు’ అని డాక్టర్ మేరీ అంటున్నారు.

రెండో ఆలోచన లేకుండానే ఆ పసికందును సంరక్షించే బాధ్యతను తీసుకున్నట్లు మేరీ తెలిపారు. క్లినికల్ సైకాలజిస్ట్ అయిన మేరీ కొచ్చిలో దివ్యాంగులకు ఓ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. మేరీకి ముగ్గురు పిల్లలు. జూన్ 15న హాస్పిటల్ లో ఉన్న బేబీని తీసుకుని అపార్టమెంట్ కాంప్లెక్స్ లో ఖాళీ ఫ్లాట్ లో ఉంచుకున్నారు. అక్కడికి మేరీ పిల్లలు ఫుడ్ తీసుకొచ్చి బయటపెట్టి వెళ్లిపోయే వారు. గుర్ గావ్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న తల్లీదండ్రికి వీడియోకాల్ చేసి ఎల్విన్ ను చూపిస్తూ ఉండేవారు.

‘ఆ డాక్టర్ ను మాకు దేవుడే పంపించాడని అనుకుంటాం. కొవిడ్-19 పేషెంట్ బేబీని దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. ఆమె కుటుంబ నిర్ణయాన్ని, ఆ కుటుంబాన్ని గౌరవిస్తున్నాను’ అని ఎల్విన్ తల్లి చెప్పింది.