Docters Helping : కరోనా సోకిన గిరిజనుల కోసం..అడవుల్లో న‌దులు దాటుకుని వెళ్లిన కేర‌ళ డాక్టర్లు

డాక్టర్లు ఉన్న చోటికి రోగులు రావటం కాదు రోగులు ఉన్నచోటికే డాక్టర్లు వెళ్లాలని వైద్య నిపుణులు చెప్పే మాట. ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు కేరళలోని డాక్టర్ల బృందం. ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్న గిరిజనుల కోసం అడవిలో కాలి నడకను కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లారు. దారిలో వాగులు..వంకలు దాటుకుంటూ నదులను కూడా దాటుకుని వెళ్లి కరోనా బాధితులకు పరీక్షలు చేసి..వారిని తమ వాహనంలో తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.

Docters Helping : కరోనా సోకిన గిరిజనుల కోసం..అడవుల్లో న‌దులు దాటుకుని వెళ్లిన కేర‌ళ డాక్టర్లు

Doctors Crossed The River Walked In Forest (3)

doctors crossed the river walked in forest : దేశంలో కరోనా వైరస్ ఉదృతి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నగరాలు, పట్టణాలే కాదు. అడవుల్లో నివసించే గిరిజనులను కూడా వదలటంలేదు. బయటి ప్రపంచంతో సంబంధాలు కొనసాగేవారికి కరోనా వస్తేనే ఆసుపత్రుల్లో బెడ్స్ లేక..ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అదే మారుమూల అడవుల్లో నివసించే అడవిబిడ్డలకు కరోనా మహమ్మారి సోకితే పరిస్తితి ఏంటీ? వారికి కాపాడేవారు ఎవరు? వారిని ఎవరు ఆదుకుంటారు? అనే పరిస్థితి వచ్చిన క్రమంలో అటువంటివారి కోసం మేమున్నామంటూ ముందుకొచ్చారు కేరళలోని కొంతమంది డాక్టర్లు.

కేరళ డాక్టర్లు కరోనా బారిన పడినవారిని ఆదుకోవటానికి సరిహద్దులను చెరిపేసి..వాగులు..వంకలు దాటుకుంటూ నదులను కూడా దాటుకుంటూ వెళ్లి కరోనా బారిన పడి..మారుమూల అడవుల్లో నివసించేవారిని ఆదుకున్నారు. కరోనా సోకినవారిని ఆదుకోవటానికి కేరళ డాక్టర్ల బృందం న‌దిని దాటింది. అడవుల్లో కిలోమీటర్ల మేర కాలినడకన నడుస్తూ..పైగా చేతుల్లో మెడికల్ బ్యాగులు దరించి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కరోనా సోకినవారిని కలుసుకున్నారు. అనంతరం వారికి మొదట చేయాల్సిన చికిత్స చేసి .. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి చికిత్సనందించారు. డామిసిలియరీ కేర్ సెంటర్ డాక్టర్ల బృందం పడిన కృషిని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మురుగుల అనే గిరిజన గ్రామానికి చేరుకుని వారికి సహాయం చేయటాన్ని ప్రశంసించిది.

మురుగుల అనే గిరిజన గ్రామం పాలక్క‌డ్‌లోని అటాప‌డికి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ముదుగర్‌, కురుంబ తెగలకు చెందిన వందమంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఒక‌ కుటుంబానికి చెందిన‌ ముగ్గురు వ్యక్తులు అధిక జ్వరాలతో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఫోను చేసి వైద్యుల‌కు తెలిపారు. వీరికి వెంట‌నే వైద్య స‌హాయం అందించాల్సివుండ‌టంతో ముగ్గురు వైద్యులు కారులో బ‌య‌లు దేరారు.

అలా ఆకారుని డ్రైవ‌ర్‌ భవానీ పుఝా నది ఒడ్డు వ‌ర‌కు మాత్రమే తీసుకెళ్లగలిగాడు. అక్కడ నుంచి వాహనంలో వెళ్లటానికి వీలులేకుండాపోయింది. కారణం అక్కడనుంచి అవతలకు వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. అలా వాళ్లు నదిని దాటుకుని త‌రువాత అటాప‌డి అడవిలో 8 కిలోమీటర్ల దూరం కాలిన నడకనే వెళ్లి ఎట్టకేలకూ మురుగల గ్రామానికి చేరుకున్నారు. అలా వెళ్లిన డాక్టర్లు గిరిజనులకు యాంటీజెన్ టెస్టులు చేశారు. మొత్తం 30మందికి ఈ టెస్టులు చేయగా..ఏడుగురు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఆ తరువాత వారికి చేయాల్సింది చేసి..వారిని పుథూర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు డాక్టర్ల బృందం.. రోగులు ఎవరైనా సరే వారు ఎక్కడున్నా వైద్యం అందించాల్సిన బాధ్యత ఉందని భావించి అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని వెళ్లిన డాక్టర్ల బృందాన్ని కేరళ ఆరోగ్యశాఖ‌ మంత్రి వీణా జార్జ్ అభినందించారు. గిరిజ‌న గ్రామానికి వెళ్లిన బృందంలో డాక్టర్ సుకన్య, హెల్త్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ సునీల్ వ‌సు, జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్‌ డాక్టర్ షౌజ్, డ్రైవర్ సాజేష్ లను అభినందించారు.