Kerala : గర్ల్స్ స్కూల్లో ఘోరం..60 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులు
కేరళలో ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై చేసిన ఘోరాలు వెలుగులోకొచ్చాయి.30 ఏళ్ల సర్వీసులో ఆ ఉపాధ్యాయుడు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం బయటకు వచ్చింది.

Kerala : పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదేదో ఒకరు ఇద్దరిపై కాదు ఏకంగా 60మంది ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు. మాస్టారనే భయంతో బయటకు చెప్పుకోలేక పాపం ఆ చిన్నారులు లోలోపలే కుమిలిపోయేవారు. అలా ఆ కీచక ఉపాధ్యాయుడు కీచక క్రీడ ఏడాది రెండేళ్లు కాదు 30 ఏళ్లు సాగింది. 30 ఏళ్లుగా స్కూల్లో చదువుకునే విద్యార్ధులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు తన కీచక క్రీడలతోనే రిటైర్ అయ్యాడు. అప్పుడు నోరు విప్పారు పాపం విద్యార్ధినులు. తమపై జరిగిన ఘోరాల గురించి చెప్పుకొచ్చారు. దీంతో సదరు కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కేరళలో జరిగింది.
కేరళలో ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై చేసిన ఘోరాలు వెలుగులోకొచ్చాయి.30 ఏళ్ల సర్వీసులో ఆ ఉపాధ్యాయుడు 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం బయటకు వచ్చింది.కేరళలోని మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా చేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు.
ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసాడని శశికుమార్ పై పోలీసు కేసు నమోదైంది. 50 మంది విద్యార్ధినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడుసార్లు కౌన్సిలర్ గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నాడు. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి అరాచకాలను బయటపెట్టింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో శశికుమార్ పరారయ్యాడు. అతడిని వారం రోజులుగా గాలించి ఎట్టకేలకు పట్టుకుని శుక్రవారం (మే 13,2022)అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తరఫున లోపాలు ఉన్నాయేమో చూడాలని కోరారు. ఈ పరిణామాలతో శివకుమార్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. మున్సిపల్ కౌన్సిలర్ పదవికి అతడు రాజీనామా చేశాడు.
1ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
2Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..
3Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..
4Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
5Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
6Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్‌డే సెలబ్రేషన్స్
7Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!
8Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
9Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
10Tomato flu: భయపెడుతున్న టొమాటో ఫ్లూ.. దేశంలో పెరుగుతున్న కేసులు
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్