Kerala Family : మానవత్వం పరిమళించింది…చిన్నారి చికిత్సకు వారం రోజుల్లో రూ. 46.78 కోట్ల విరాళాలు

కన్నూరు జిల్లాకు చెందిన పి.కె.రఫీక్, మరియమ్మ దంపతులకు మొహమ్మద్ కుమారుడున్నాడు. ఇతనికి 18 నెలలు. అయితే..చిన్నారికి అరుదైన ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి చికిత్స అందించాలంటే..‘జోల్ జెన్స్ మా’ మందు అవసరం ఉంటుంది.

Kerala Family : మానవత్వం పరిమళించింది…చిన్నారి చికిత్సకు వారం రోజుల్లో రూ. 46.78 కోట్ల విరాళాలు

Kerala

Crowdfunds Rs 46.7 Crore : మానవత్వం పరిమళించింది. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వారిని కొందరు ఆదుకుంటున్నారు. తమకు తోచిన విధంగా విరాళాలు అందచేస్తున్నారు. ఇటీవలే చిన్నారులు అరుదైన వ్యాధి బారిన పడడం..వారు ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుండడంతో తల్లిదండ్రులు ‘క్రౌడ్ ఫండింగ్’ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా..కేరళ రాష్ట్రానికి చెందిన 18 నెలల చిన్నారి వైద్య చికిత్స కోసం రూ. 46.78 కోట్ల రూపాయలను దాతలు అందచేశారు.

Read More : Sunny Leone : బన్నీతో స్పెషల్ సాంగ్ కోసం సన్నీ అంత అడిగిందా..!

కన్నూరు జిల్లా : –
కన్నూరు జిల్లాకు చెందిన పి.కె.రఫీక్, మరియమ్మ దంపతులకు మొహమ్మద్ కుమారుడున్నాడు. ఇతనికి 18 నెలలు. అయితే..చిన్నారికి అరుదైన ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి చికిత్స అందించాలంటే..‘జోల్ జెన్స్ మా’ మందు అవసరం ఉంటుంది. ఈ మందు అత్యంత ఖరీదు కావడంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఒక్క డోస్ కు రూ. 18 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Read More : భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

క్రౌడ్ ఫండ్ : –
ఓ వైపు వ్యాధితో బాధపడుతున్న చిన్నారి, మరోవైపు..అంత డబ్బు సమకూర్చలేని ఆర్థిక పరిస్థితితో వారు తీవ్రంగా బాద పడ్డారు. ఈ విషయం కలైసరి ఎమ్మెల్యే ఎం.విజిన్ కు తెలిసింది. చిన్నారి చికిత్సకు సహాయం చేయాలని ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా సహయం చేయాలని అభ్యర్థించారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దేశ విదేశాల్లో ఉన్నవారు స్పందించారు. తమకు తోచిన విధంగా సహాయం చేశారు. కేరళీలయులతో సహా…మొత్తం 7.7 లక్షల మంది స్పందించారు. ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు అకౌంట్లలో కేవలం వారం రోజుల్లో మొత్తం రూ. 46,78,72,125 విరాళాల రూపంలో జమ అయ్యాయి. తమ కుమారుడికి చికిత్స కోసం సహాయం చేస్తున్న దాతలకు పి.కె.రఫీక్, మరియమ్మలు కృతజ్ఞతలు తెలియచేశారు.