కాలు కదపనివ్వట్లేదుగా : కరోనా కట్టడి కోసం కేరళ కఠినమైన చట్టాలు

  • Published By: nagamani ,Published On : November 6, 2020 / 01:21 PM IST
కాలు కదపనివ్వట్లేదుగా : కరోనా కట్టడి కోసం కేరళ కఠినమైన చట్టాలు

Kerala corona act : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో. కరోనాకు ఇప్పటివరకూ వ్యాక్సిన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ లోపు కరోనా మహమ్మారిని కట్టడిచేయాలి. దీనికోసం పలు రాష్ట్రాల ప్రభుత్వం కఠిన నిబంధనల్ని విధిస్తున్నా..కేరళ మాత్రం మరో అడుగు ముందుకు వేసి మరింత ఉన్న చట్టాల్ని కఠినంగా అమలు చేస్తోంది.



కరోనాను కట్టడి చేసిన మొదటిరాష్ట్రంగా కేరళ పేరు తెచ్చుకుంది. కానీ మరోసారికరోనా వ్యాప్తి పెరగటంతో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం కఠినమైన చట్టాలను ప్రయోగించి..మరోసారి దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కరోనా కట్టడిలో భాగంగా..కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144తో పాటు, సెక్షన్ 151, 149 వంటి చట్టాలను విధించింది. ఈ ఏక్ట్ ప్రకారం ప్రజలు ఒకేచోట గుమి కూడటటం నిషేధం.



ఏదైనా కార్యక్రమాలకు పెద్దఎత్తున హాజరు కావడాన్ని అడ్డుకోవటం వంటివన్నమాట. ఈ ఇటువంటి కఠిన చట్టాలను ప్రజలపై విధించటం అవసరమా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని అంటోంది ప్రభుత్వం. కరోనా విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 151, 149 సెక్షన్లు అమలులో ఉన్న క్రమంలో పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే..స్థానిక మెజిస్ట్రేట్ పర్మిషన్ గానీ.. కనీసం వారంట్ అవసరం కూడా లేకుండానే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు.



ఆ తరువాత వారిని ఒక రోజు కస్టడీలో కూడా ఉంచే అధికారం ఉంటుంది. అవసరమైతే ఆ కష్టడీని మరోరోజుకు కూడా పొడిగించవచ్చు. సెక్షన్ 144 అమలులో ఉంటే..ఒకేచోట ముగ్గురి కంటే ఎక్కువమంది గుమికూడి ఉండకూడదు. దీంతో ప్రభుత్వం విధించే ఈ చట్టాల అమలుపై వ్యతిరేకత వస్తోంది. కాగా..ఈ సెక్షన్లను అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అశాంతి ఉన్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు వినియోగించే చట్టాలు. కానీ కరోనా కట్టడి కోసం ఈ కఠిన చట్టాల్ని వినియోగించటపై విమర్శలు తలెత్తున్నాయి.



ఈ చట్టాలు అమలులో ఉన్న సమయంలో ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే..రెండు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించేందుకు వీలుంటుంది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



కరోనాను నియంత్రించాలంటే ఈ కఠిన సెక్షన్ల ప్రయోగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఈ చట్టాల అమలు సమయంలో తమ అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని..ఇది ప్రజల స్వేచ్ఛను హరిస్తుందని అంటున్నారు. కానీ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు..ప్రజల ఆరోగ్యం కోసం కఠినంగా వ్యవహరించక తప్పదంటోంది ప్రభుత్వం.