Shawarma: లైసెన్స్ లేకుండా షావర్మా అమ్మితే రూ.5 లక్షల జరిమానా.. కొత్త రూల్స్ రూపొందించిన కేరళ సర్కార్

షావర్మా అమ్మకాలపై కొత్త రూల్స్ విధించింది కేరళ సర్కార్. ఇకపై షావర్మా అమ్మాలంటే ఏ హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

Shawarma: లైసెన్స్ లేకుండా షావర్మా అమ్మితే రూ.5 లక్షల జరిమానా.. కొత్త రూల్స్ రూపొందించిన కేరళ సర్కార్

Shawarma: షావర్మా అమ్మాలంటే ఇకపై హోటల్స్, రెస్టారెంట్లు లైసెన్స్ తీసుకోవాల్సిందే. అయితే, ఈ రూల్ మనదగ్గర కాదు. కేరళలో అక్కడి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందీ రూల్. ఇటీవల 16 ఏళ్ల ఒక యువకుడు షావర్మా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ప్రాణాలు కోల్పోయాడు.

Pawan Kalyan: విజయవాడలో వైసీపీ-జనసేన ఘర్షణ.. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మరికొందరు ఆస్పత్రి పాలై ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేరళ వైద్య, ఆరోగ్య శాఖ.. షావర్మా అమ్మకాలు, తయారీపై కొత్త రూల్స్ రూపొందించింది. ఈ నెల 1 నుంచే ఈ రూల్స్ అక్కడ అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా షావర్మా తయారు చేసి అమ్మాలంటే ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా షావర్మా విక్రయిస్తే రూ.5 లక్షల వరకు జరిమానాతోపాటు, ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. అలాగే షావర్మా ఎప్పుడు తయారైంది, ఎక్స్‌పైరీ డేట్ విధిగా వెల్లడించాలి. పార్శిళ్లపై కూడా ఈ వివరాలు ఉండాలి. అలాగే ఇష్టమొచ్చినట్లు బయట పెట్టి షావర్మా అమ్మడానికి వీల్లేదు.

Ravindra Jadeja: ఆసియా కప్ నుంచి జడేజా ఔట్… అక్సర్ పటేల్‌కు అవకాశం

గంట సేపటికంటే ఎక్కువ సమయం షావర్మా బయట ఉంచకూడదు. మయనైజ్ కూడా రెండు రోజులకు మించి వాడకూడదు. అలాగే నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద షావర్మా ఉంచరాదు. ప్రభుత్వం రూపొందించిన ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో కావాలి. షావర్మా తయారు చేసేందుకు వాడే చికెన్‌ను కనీసం 15 నిమిషాలపాటు ఉడికించాలి. షావర్మాతోపాటు ఇచ్చే కుబ్బూస్ లేదా బ్రెడ్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి. వీటిలో ఏ రూల్ ఉల్లంఘించినా.. జరిమానా విధిస్తారు.