Sabarimala: యాలకుల ఎఫెక్ట్.. శబరిమల ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిపివేత

కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయంలో ప్రసాదం విక్రయాలు నిలిపివేశారు.

Sabarimala: యాలకుల ఎఫెక్ట్.. శబరిమల ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిపివేత

sabarimala

Sabarimala: కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయంలో ప్రసాదం విక్రయాలు నిలిపివేశారు. ఇందుకు కారణం.. యాలుకలు. అరవణ ప్రసాదం తయారీలో వినియోగించే యాలకులు చాలా తక్కువే. అయితే, కొన్ని రకాల యాలుకలు రసాయనాల మోతాదుకు మించి ఉన్నాయని కోర్టు పేర్కొంది. దీంతో విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది.

Sabarimala Pilgrimage: శబరిమలలో ప్రతీరోజూ 90వేల మందికే అనుమతి.. దర్శనం వేళల్లో మార్పులు

శబరిమల ‘అరవణ ప్రసాదం’లో యాలుకలు వినియోగిస్తారు. ఈ యాలకులను ట్రావెన్ కోర్ బోర్డు అంతకుముందు అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2022- 2023 సీజన్‌లో ఈ యాలకుల కాంట్రాక్టును అక్రమంగా ఓ సప్లయర్ కు అప్పగించిందని స్సైసెస్ కంపెనీ ఆరోపించింది. వారు అందించే యాలకుల నాణ్యతపై ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లాబోరేటరీలో పరీక్షించారు.

 

పరీక్షల అనంతరం కొల్లా కంపెనీ సప్లయ్ చేసిన యాలకుల్లో 14రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో కోర్టు ప్రసాదాన్ని భక్తులకు అమ్మకుండా ట్రావెన్ కోర్ బోర్డుకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తుదితీర్పు విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం శబరి ఆలయంలో ప్రసాద విక్రయాలు నిలిపివేశారు. అయితే, యాలకులు లేకుండా ప్రసాదం విక్రయాలు చేసుకోవచ్చని, అంతేగాకా ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే యాలకులను వినియోగించి తయారు చేసిన ప్రసాదాన్ని విక్రయాలు చేయొచ్చని కేరళ హైకోర్టు బోర్డుకు సూచించింది.