Kerala : కోవిడ్ వార్డులో వివాహం, వరుడికి పాజిటివ్..పెళ్లికి పట్టుబట్టిన వధువు

అళపుజ జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామిలు ప్రేమలో పడ్డారు. చెట్టాపెట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులుగా తిరిగిన వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

Kerala : కోవిడ్ వార్డులో వివాహం, వరుడికి పాజిటివ్..పెళ్లికి పట్టుబట్టిన వధువు

Alappuzha Media College

Alappuzha Media College : ప్రపంచాన్ని మొత్తం కోవిడ్ తో వణికిపోతోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ కారణంగా..ఎన్నో కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. అందులో శుభకార్యాలు ఒకటి. వివాహాలు జరుగకపోతుండడంతో ఈ రంగంపైన ఆధారపడి ఉన్న వారు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా మంది పెళ్లిళ్లు పోస్ట్ పోన్డ్ చేసుకుంటున్నారు. అయితే..మృత్యుఘంటికలు మ్రోగుతున్న వేళ..తమ పెళ్లి ఖచ్చితంగా జరగాలని పట్టుబట్టిందో ఓ వధువు. కోవిడ్ వార్డులో పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అళపుజ జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామిలు ప్రేమలో పడ్డారు. చెట్టాపెట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులుగా తిరిగిన వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరువురు కుటుంబాలు పెళ్లి సన్నాహాల్లో ఉన్నారు. అంతలోనే షాకింగ్ ఒక న్యూస్ బయటపడింది. శరత్ కు కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. అతని తల్లికి వైరస్ సోకడంతో వీరిద్దరినీ ఆళపుజ మెడికల్ కాలేజీకి తరలించి..కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం అభిరామికి తెలిసింది. తమ పెళ్లి మాత్రం నిలిచిపోరాదని పట్టుబట్టింది.

ఏప్రిల్ 25వ తేదీన వివాహం జరపాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి. జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల అనుమతి తీసుకున్నారు. వార్డులోకి పీపీఈ కిట్ ధరించి అభిరామి పెళ్లి కూతురిలా వచ్చింది. శరత్ తల్లి ఇరువురికి పూలదండలు అందించింది. శరత్, అభిరామిలు ఇద్దరూ మార్చుకున్నారు. వీరి వివాహం ఈ వార్డులోనే జరిగిపోయింది. కోవిడ్ విజృంభణలో జరిగిన వీరి వివాహం ఇప్పుడు వైరల్ గా మారింది.

Read More : Snake’s Thirst : మండుటెండ, పాముకు నీళ్లు తాగించాడు