కేరళలో నెల రోజులపాటు 144 సెక్షన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2020 / 05:52 PM IST
కేరళలో నెల రోజులపాటు 144 సెక్షన్

Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్​ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​ను విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం విధించిన తాజా నిబంధనలు అక్టోబర్ 3 ఉదయం 9గంటల నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వాస్​ మెహతా పేర్కొన్నారు. ఈ నెల​ 31 వరకు సెక్షన్​-144 అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఒకేచోట ఐదుగురికంటే ఎక్కువ మంది సమావేశమవడం నిషేధం. అయితే.. శుభకార్యాలు, అంత్యక్రియలు మొదలగువాటికి సడలింపు ఉంటుంది. వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న కంటైన్​మెంట్​ జోన్​లలో మాత్రం ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉండనున్నాయి..

కేరళలో గురువారం ఒక్కరోజే 8 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. బాధితుల సంఖ్య 2లక్షల మార్కును దాటింది. ఇప్పటివరకు కేరళలో 771 కరోనా మరణాలు నమోదయ్యాయి.