Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11వేల కేసులు,120 మరణాలు

కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11వేల కేసులు,120 మరణాలు

Kerala (5)

Kerala  కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కేరళలో గడిచిన నెల రోజులుగా దాదాపు10 వేల కేసులు,వందకు పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 10,944 కరోనా కేసులు, 120 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,74,639కి, మొత్తం మరణాల సంఖ్య 26,072కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 46,31,300కి చేరింది.

గత 24 గంటల్లో 95,510 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,645 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో 12,922 మంది కరోనా రోగులు కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

ALSO READ  వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీసులోకి అనుమతి..ఢిల్లీ సర్కార్ ఆదేశాలు