Covid Cases In Kerala : కేరళలో కోవిడ్ విజృంభణ..24వేలకు పైగా కొత్త కేసులు

కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత

Covid Cases In Kerala : కేరళలో కోవిడ్ విజృంభణ..24వేలకు పైగా కొత్త కేసులు

Kerala (2)

Covid Cases In Kerala కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత మళ్లీ పెరిగాయి. మంగళవారం కేరళలో 24,296 కొత్త కోవిడ్ కేసులు,173 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేరళలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,51,984, మొత్తం మరణాల సంఖ్య 19,757కి చేరింది. రాష్ట్రంలో టెస్ట్ ‌పాజిటివిటీ రేటు 18.04 శాతంగా నమోదైంది.

గత 24 గంటల్లో 19,349 మంది కరోనా రోగులు కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,72,357కు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,59,335 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది.

అయితే,కేసుల సంఖ్య పెరుగుతన్నప్పటికీ..మరిన్ని ఆంక్షలు విధించకూడదని రాష్ట్ర కోవిడ్ -19 రివ్యూ కమిటీ నిర్ణయించింది. ఆదివారం రోజు మాత్రం పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగించాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం మరియు ఓనం వేడుకల దృష్ట్యా కేరళలో ఆదివారం లాక్ డౌన్ రెండు వారాలుగా నిలిపివేయబడిన విషయం తెలిసిందే.