Covid Cases : కేరళలో కరోనా విలయం.. కొత్తగా 30వేల కేసులు

కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Covid Cases : కేరళలో కరోనా విలయం.. కొత్తగా 30వేల కేసులు

Covid Cases

Covid Cases : కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 42,83,494కు చేరింది. గత శుక్రవారం నుంచి కేరళలో ఒక్కరోజులో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

Credit Card : జాబ్ లేకున్నా క్రెడిట్ కార్డు.. ఇలా పొందొచ్చు..

ఈ క్రమంలో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన టెస్ట్ పాజిటివిటీ రేట్ (టీపీఆర్) మళ్లీ పెరిగింది. కొన్నిరోజులుగా 16 శాతం కన్నా తక్కువగా ఉన్న ఈ రేటు బుధవారం నాడు 17.63 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,79,295 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 40,21,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,39,480 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

గడిచిన 24 గంటల్లో కేరళలో 181 కరోనా మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 3,832 కరోనా కేసులు నమోదవగా.. ఎర్నాకుళం, కోజికోడ్, తిరువనంతపురం తదితర జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే కొత్తగా నమోదైన కేసుల్లో 130 మంది హెల్త్ వర్కర్లు కాగా, 190 మంది రాష్ట్రం వెలుపల నుంచి వచ్చారు. మిగిలినవారిలో 28,617 మందికి పరిచయస్తుల ద్వారా కరోనా సోకినట్లు గుర్తించారు.