Mahindra Jeep : పిల్లల కళ్లలో ఆనందం కోసం.. ఏకంగా బుల్లి మహీంద్ర జీపునే తయారు చేశాడు..

పిల్లలు అడిగిన బొమ్మలు తల్లిదండ్రులు కొనివ్వడం చేయడం. వారు ఏది అడిగితే అది కొనిచ్చి వారి కళ్లలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే, కేరళకు చెందిన ఒక వ్యక్తి మరో అడుగు ముందుకేశాడు. ఎవరూ చేయని పని చేశాడు. తన క్రియేటివిటీతో తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఒక బుల్లి జీపునే తయారు చేసి ఇచ్చాడు.

Mahindra Jeep : పిల్లల కళ్లలో ఆనందం కోసం.. ఏకంగా బుల్లి మహీంద్ర జీపునే తయారు చేశాడు..

Miniature Replica Of Mahindra Jeep

Miniature Replica Of Mahindra Jeep : పిల్లలు అడిగిన బొమ్మలు తల్లిదండ్రులు కొనివ్వడం చేయడం. వారు ఏది అడిగితే అది కొనిచ్చి వారి కళ్లలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే, కేరళకు చెందిన ఒక వ్యక్తి మరో అడుగు ముందుకేశాడు. ఎవరూ చేయని పని చేశాడు. తన క్రియేటివిటీతో తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఒక బుల్లి జీపునే తయారు చేసి ఇచ్చాడు.

మలప్పురం జిల్లాలోని ఆరికోడ్ నివాసి షకీర్ తన పిల్లలు ఆడుకోవడం కోసం ఒక చిన్న సాఫ్ట్ టాప్ మహీంద్రా జీపును తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. దానికి అవసరమైన అన్ని వస్తువులను తయారుగా పెట్టుకుని జీపును సిద్ధం చేసి పిల్లల చేతిలో పెట్టాడు. అతడు తయారు చేసిన రెప్లికా జీపు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

మహీంద్రా జీప్‌కు ప్రతిరూపమైన ఈ జీప్ 1000 వాట్స్ మోటారుతో పని చేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్, పవర్ స్టీరింగ్, వేరు చేయగలిగిన సాఫ్ట్ టాప్, హెడ్‌లైట్స్‌.. అన్ని నిజమైన జీపులో మాదిరిగానే అమర్చాడు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి షకీర్‌కు సంవత్సరం పట్టింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో.. షకీర్ తాను తయారు చేసిన రెప్లికా జీప్‌తో నవ్వులు చిందిస్తూ ఎలా తయారు చేసింది వివరించాడు. దాదాపు 60-70 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఉన్న ఈ జీపు తయారీకి దాదాపు రూ.1.5 లక్షల వరకు ఖర్చైంది.

మొత్తంగా తన పిల్లల ముచ్చట తీర్చాడు షకీర్. బుల్లి మహీంద్ర జీపులో ఎక్కి పిల్లలు తెగ సంబరపడుతున్నారు. అందులో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.