4 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్‌కు మందులిచ్చేందుకు 150కిలోమీటర్ల ప్రయాణం

4 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్‌కు మందులిచ్చేందుకు 150కిలోమీటర్ల ప్రయాణం

నాలుగు సంవత్సరాల వయస్సున్న క్యాన్సర్ పేషెంట్ కు మందులివ్వడానికి కేరళలో మందులు అమ్మేవ్యక్తి 150కిలోమీటర్లు ప్రయాణించాడు. కేరళలోని తిరువనంతపురం రీజనల్ క్యాన్సర్ సెంటర్లో కీమో థెరఫీ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది పేషెంట్. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా కీమో యూనిట్ మూసేశారు. కానీ, మందులు వాడమని వైద్యులు సూచించారు. 

ఆమె ఉంటున్న జిల్లాలో మందులు దొరకలేదు. చిన్నారి ఆరోగ్యం కాపాడమని సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆంటోనీ రథీశ్ ను కలిశారు. ఆయనకు స్నేహితుడు మాజీ పోలీస్ ఆఫీసర్, మందులు అమ్మేవ్యక్తి విష్ణుని సంప్రదించారు. తిరువనంతపురంలోని రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి మందులు తీసుకురావాలని కోరారు. అలప్పుజా నుంచి తిరువనంతపురం వెళ్తున్న విష్ణు సాయం చేయడానికి ఒప్పుకుని మార్చి 29న మందులు తీసుకోవడానికి బయల్దేరాడు. 

విష్ణు దగ్గర ఉన్న మందుల చిట్టీ పాతది. కానీ, ఆ రోగి గురించి తెలిసిన డాక్టర్ ఉండటంతో సరైన మందులు ఇచ్చి పంపాడు. ఫార్మసీలోకి వెళ్లి మందులు తీసుకున్న విష్ణుకు మరో ఛాలెంజ్ ఎదురైంది. ఆ రోజు సాయంత్రం 6గంటలకు చిన్నారికి మందులు తప్పకుండా తీసుకోవాలి. సగం దూరం వరకూ వేరే వారి ద్వారా పంపితే అక్కడి నుంచి మరొకరు తీసుకెళ్తారనే ప్లాన్ వేశాడు. (లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన సెక్స్‌టాయ్స్ అమ్మకాలు)

అది ఫెయిల్ అవడంతో మెడిసిన్ తీసుకుని మళ్లీ అలప్పుజా తిరుగు ప్రయాణమయ్యాడు.  ఆ కుటుంబానికి విష్ణు సాయంత్రం 5గంటల 10నిమిషాల కల్లా ఇవ్వగలిగాడు. ఇంత తక్కువ సమయంలో 150కిలోమీటర్లు  బైక్ మీద ప్రయాణించడం కష్టంతో కూడుకున్న పని. రోగి కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చులుకూడా భరించలేకపోతుంది ఎవరైనా సాయం చేయాలని ఈ సందర్భంగా విష్ణు ఆ కుటుంబం తరపున అడుగుతున్నాడు.