FIFA World Cup: పోలీసులపైనే దాడి చేసిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. పలుచోట్ల రెచ్చిపోయిన ఆకతాయిలు

‘ఫిఫా వరల్డ్ కప్’లో అర్జెంటినా విక్టరీ సెలబ్రేషన్స్ పలు చోట్ల ఘర్షణలకు దారి తీశాయి. అనేక చోట్ల ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. సామాన్యులతోపాటు పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.

FIFA World Cup: పోలీసులపైనే దాడి చేసిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. పలుచోట్ల రెచ్చిపోయిన ఆకతాయిలు

FIFA World Cup: ఆదివారం రాత్రి జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటినా గెలిచిన సంగతి తెలిసిందే. అర్జెంటినా గెలుపుపై ఇండియలోనూ పలువురు సంబరాలు చేసుకున్నారు. అయితే, కొన్ని చోట్ల ఈ సెలబ్రేషన్స్ ఉద్రిక్తతలు, గొడవలకు దారి తీశాయి. ముఖ్యంగా కేరళలో కొందరు ఫ్యాన్స్ పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు.

Karnataka: కొనసాగుతున్న కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. బెలగావిలో ‘మహా’ నిరసన.. 144 సెక్షన్ విధింపు

ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకల సందర్భంగా పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. కేరళ, కన్నూర్ పట్టణంలో అర్జెంటినా విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ ఒక వ్యక్తిని కత్తితో పొడిచారు. కన్నూర్‌లో అనురాగ్ అనే వ్యక్తి స్థానిక స్టేడియంలో మ్యాచ్ చూసి, అర్ధరాత్రి ఇంటికి తిరిగెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఐదుగురు వ్యక్తులు, అనురాగ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అతడిని కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ అనురాగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ దాడిని అనురాగ్ స్నేహితులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితులు వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. అందులో ఒక వ్యక్తి తలపై క్రికెట్ స్టంప్‌తో బలంగా కొట్టారు. దీంతో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీళ్లంతా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.

#GoogleForIndia2022: ఏఐ పరిశోధనల కోసం ఐఐటీ-మద్రాస్‌కు గూగుల్ రూ.8.26 కోట్లు

బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే కోచి పట్టణంలోని కాలూర్ పరిధిలో ఒక పోలీసుపై కొందరు అర్జెంటినా ఫ్యాన్స్ దాడి చేశారు. వాళ్లు రోడ్డు బ్లాక్ చేసి, సెలబ్రేషన్స్ జరుపుకొంటుండగా పోలీస్ అడ్డుకున్నాడు. ట్రాఫిక్ వెళ్లేలా సహకరించాలని, రోడ్డు క్లియర్ చేయాలని కోరాడు. దీంతో ఫ్యాన్స్ అంతా కలిసి పోలీస్‌పై దాడికి పాల్పడ్డారు. తిరువనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించగా వాళ్లు పోలీసులపై దాడి చేసి గాయపరిచారు. అన్ని ఘటనల్లో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు.