Kerala Ministe: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మంత్రి పదవికి సాజీ రాజీనామా

కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సాజీ ప్రకటించారు.

Kerala Ministe: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మంత్రి పదవికి సాజీ రాజీనామా

Cheriyan Resigns

Kerala Ministe: కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సాజీ ప్రకటించారు.

MP Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. టీఎంసీ ఎంపీపై కేసు నమోదు

ఓ రాజకీయ కార్యక్రమంలో దేశ రాజ్యాంగంపై సాజీ చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనుమతించదని, కానీ వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని, దానినే 75ఏళ్లుగా అమలు చేస్తున్నామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

చెరియన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మంగళవారం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆయన్ను వెంటనే కేబినెట్ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్‌ అవమానించారంటూ కేరళ అసెంబ్లీలో విపక్షాలు వ్యతిరేక నినాదాలు చేశాయి. ఈ క్రమంలో చర్చ జరగకుండానే స్పీకర్‌ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్‌ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు.