మార్నింగ్ వాక్ చేసిన 41 మంది అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : April 4, 2020 / 05:16 AM IST
మార్నింగ్ వాక్ చేసిన 41 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ వెసులు బాటును కొందరు దుర్వినియోగం చేసే సరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

కేరళలోని కొచ్చిలో పానంబెల్లి నగర్‌ ప్రాంతంలో కొంతమంది శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. లాక డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి వీరంతా ఉదయం సామూహికంగా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో సర్వైలెన్స్‌ చేస్తుండగా గుంపులుగా వెళ్తున్న వీరు కనపడ్డారు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా వీరందరిని అరెస్ట్‌ చేసినట్లు కొచ్చి సౌత్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశారు. కేరళలో ఇప్పటివరకు 295 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read |  ఆమె 8 నెలల గర్భిణీ.. కరోనా సోకిన వారికి సాయం చేయాలని 250 కిలోమీటర్లు ప్రయాణించిన నర్సు