Kerala Rains : ఇడుక్కి డ్యామ్ లోకి భారీగా వరదనీరు..24గంటల్లోనే 4అడుగులకు పైగా

కేరళలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెరియార్‌ నదిపై నిర్మించిన ఇడుక్కి డ్యాంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్టోబర్ 16 మరియు అక్టోబర్ 17 మధ్య 24 గంటల్లోనే

Kerala Rains :  ఇడుక్కి డ్యామ్ లోకి భారీగా వరదనీరు..24గంటల్లోనే 4అడుగులకు పైగా

Idukki

Kerala Rains కేరళలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెరియార్‌ నదిపై నిర్మించిన ఇడుక్కి డ్యాంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్టోబర్ 16 మరియు అక్టోబర్ 17 మధ్య 24 గంటల్లోనే 4.25 అడుగులకు పైగా నీరు చేరింది. అయితే 2018 తర్వాత ఇడుక్కి డ్యామ్ లోకి ఇంత ఎక్కువ నీటి ప్రవాహం రావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. అక్టోబర్ 16 ఉదయం డ్యామ్ లో నీటిమట్టం 2391.12 అడుగులు. ఆ తర్వాత చాలా త్వరగా దాదాపు ఐదు అడుగులు నీటి మట్టం పెరిగింది.

డ్యామ్ లో ప్రస్తుతం నీటిమట్టం 2,395.56 అడుగులకు చేరుకోగా ఇది నిల్వ స్థాయిలో( storage level) 91.38శాతం. కాగా,డ్యామ్ పూర్తి నిల్వ స్థాయి 2,403.50 అడుగులు. ఈ నేపథ్యంలో డ్యామ్ భద్రతను నిర్ధారించడానికి, అవుట్‌ఫ్లోను నియంత్రించడానికి నిపుణుల ప్యానెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా,ఆసియాలోనే వలయాకారంలో నిర్మితమైన అతిపెద్ద డ్యామ్ లలో ఇడుక్కి డ్యామ్ ఒకటి. కేరళ రాష్ట్రంలో భారీ హైడ్రాలిక్‌ ప్రాజెక్టులలో ఇది ఒకటి కావడం గమనార్హం.

కేరళలో భారీ వర్షాల కారణంగా వేరువేరు ఘటనల్లో ఇప్పటివరకు 27మంది మరణించగా..పలువురు గల్లంతయ్యారు. కేరళలో తాజా పరిస్థితులపై సీఎం పినరయి విజయన్​తో ఫోన్ లో మాట్లాడినట్లు ఆదివారం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో తెలిపారు. క్షతగాత్రులు, బాధితులకు అండగా నిలిచేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారన్నారు. కేరళవాసులు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.

ALSO READ వర్షాలకు, వరదలకు కేరళలో జలప్రళయం