Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11,546 పాజిటివ్ కేసులు

కేర‌ళ‌ కోవిడ్ ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు.

Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11,546 పాజిటివ్ కేసులు

Kerala

Kerala కేర‌ళ‌ కోవిడ్ ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున న‌మోద‌వుతోంది. శుక్ర‌వారం కేరళ వ్యాప్తంగా 11,546 కొత్త కోవిడ్ కేసులు,118 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 81మంది హెల్త్ వర్కర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. శుక్ర‌వారం మొత్తం 11,056 మంది క‌రోనా బాధితులు కోలుకున్నట్లు తెలిపింది.

గడిచిన 24 గంటల్లో 1,08,867 శాంపిల్స్ కు టెస్ట్ లు చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. టెస్ట్ పాజిటివిటీ రేటు 10.6శాతంగా ఉన్నట్లు తెలిపింది. కొత్త కోవిడ్ పేషెంట్లలో 70 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారని కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కోవిడ్ కేసుల్లో 671మందికి వైరస్ ఎలా సోకిందన్నది ఇంకా తెలియలేదని తెలిపింది. ఇక,రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 12,699కి చేరినట్లు తెలిపింది.