Kerala Covid-19 : కేరళలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

10TV Telugu News

Kerala Covid-19 : కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.  శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 17,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32, 71, 530 కి చేరింది.

కోవిడ్ సోకి గత 24 గంటల్లో 66 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16,035కు పెరిగింది.  మరోవైపు గత 24 గంటల్లో 15,247 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య   31,14,716కు చేరుకున్నదని,   ప్రస్తుతం రాష్ట్రంలో  1,40,276 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది.  కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతోంది. కేరళలో పాజిటివిటీ రేటు    జూలై 19 న 11 శాతం  కాగా..  జూలై 23 న 13.63 శాతానికి పెరిగింది. తిరిగి జూలై 24 న ఇది 11.91 శాతానికి పడిపోయింది.  తాజాగా ఇది 12.3 శాతానికి  పెరిగింది.

10TV Telugu News