Kerala : కరోనా వేళ..నవంబర్ 1 నుంచి స్కూళ్లు

స్కూళ్లను తెరిచేందుకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై కోర్ కమిటీ సమావేశం జరిగింది.

Kerala : కరోనా వేళ..నవంబర్ 1 నుంచి స్కూళ్లు

Kerala Schools

Kerala Schools : కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎన్నో రంగాలపై పడింది. ప్రధానంగా విద్యా వ్యవస్థ అతాలకుతలమై పోయింది. స్కూళ్లు, కాలేజీలు, విద్యాలయాలు తెరవకపోవడంతో..విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని విద్యాలయాలు ఆన్ లైన్ లో విద్యాబోధన చేశారు. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో పలు రాష్ట్రాలు విద్యా సంస్థలు తెరుచుకోవచ్చని సూచిస్తున్నాయ.

Read More : Ganesh Idols : పాతబస్తీ నుండి ట్యాంక్ బండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు

కరోనా నిబంధనలు పాటిస్తూ..విద్యార్థులను స్కూళ్లకు అనుమతినిస్తున్నారు. కేరళ రాష్ట్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అయినా..కూడా స్కూళ్లను తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నవంబర్ 01 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్కూళ యాజమాన్యాలకు సూచించింది.

Read More : AP : పరిషత్ ఓట్ల లెక్కింపు..ఎలా లెక్కిస్తారో తెలుసా ?

తొలుత అక్టోబర్ 04వ తేదీ నుంచి ఉన్నత విద్యా సంస్థలను తెరవాలని భావించారు. కానీ..మూడు నెలలుగా కరోనా తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. మరోవైపు..కేరళ రాష్ట్రంలో మాత్రం హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సినిమా థియేటర్ల తెరవడంపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.