Tiger Attack: కేరళలో పులి దాడిలో రైతు మృతి.. పొలంలో పని చేసుకుంటుండగా దాడి చేసిన పులి

కేరళలోని వయానంద్‌ ప్రాంతం, పుతుస్సెరీలో గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. థామస్ అలియాస్ సల్లు అనే 50 ఏళ్ల రైతు పొలంలో పని చేసుకుంటుండగా పులి దాడి చేసింది.

Tiger Attack: కేరళలో పులి దాడిలో రైతు మృతి.. పొలంలో పని చేసుకుంటుండగా దాడి చేసిన పులి

Tiger Attack: జనావాసాల్లోకి అటవీ జంతువులు చొరబడి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేరళలో ఒక పులి దాడి చేయడంతో రైతు మరణించాడు.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

కేరళలోని వయానంద్‌ ప్రాంతం, పుతుస్సెరీలో గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. థామస్ అలియాస్ సల్లు అనే 50 ఏళ్ల రైతు పొలంలో పని చేసుకుంటుండగా పులి దాడి చేసింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించడంతో పులి అతడ్ని వదిలేసి పారిపోయింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన సల్లూను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Pak Embassy: వీసా ఇంటర్వ్యూలో సెక్స్ గురించి అడిగారు.. పాక్ రాయబారిపై పంజాబ్ ప్రొఫెసర్ ఆరోపణ

అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మరో ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో కార్డియాక్ అరెస్టుతో సల్లూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పులిని చంపేందుకు స్థానికులు ఆయుధాలు చేతబట్ట గాలించడం మొదలుపెట్టారు. అటవీ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన అధికారులు పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.