కేరళలో Cluster Care వ్యూహం

10TV Telugu News

కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది.

పాజిటివ్ కేసులు బయటపడుతున్న ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ ప్రబలకుండా…ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా…పకడ్బంది చర్యలు తీసుకుంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు. కేసులు ఎక్కువగా ఉన్న తీర ప్రాంత జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెడుతామన్నారు.

పరీక్షలు, చికిత్సలు చేస్తామని, క్లస్టర్లలో ఉన్న వారు మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. హ్యాండ్ వాష్, శానిటైజర్ వాడుతూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని, ఊహించని విధంగా కేసులు పెరుగుతున్న క్రమంలో క్లస్టర్ ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో 87 క్లస్టర్లు ఉన్నాయని, వాటిలో 70 యాక్టివ్ క్లస్టర్లు, 17 క్లస్టర్లు ఉన్నాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఏడు రోజుల్లోపు కొత్త కేసు లేదని నిర్ధారించిన తర్వాతే..ఇతర చర్యలు తీసుకుంటామన్నారు.

తిరువనంతపురంలోని పూంథూరా, పిల్లువిలాల్లో వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందని, సమీప ప్రాంతాలో పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేరళ రాష్ట్రంలో 2020, జులై 18వ తేదీ శనివారం 593 కొత్త కేసులు నమోదయ్యాయని, 364 కేసులు కాంటాక్ట్ గా గుర్తించారు.