నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని, కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ

నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని, కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ

kerala transwoman story : నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని..నా నాడీ ఇదే చెబుతోంది అంటున్నాడు. నన్ను నేను అబ్బాయిగా అనుకోలేకపోతున్నా..వెల్లడిస్తున్నాడు. ఇది కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ ఇది. కేరళలోని త్రిసూర్ లో జిను శశిధరన్. తల్లిదండ్రులు ఇద్దరూ నర్సులుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరినీ డాక్టర్లు చేయాలని వారు భావించారు. కానీ..అబ్బాయి దేహంలో చిక్కుకపోయిన..అమ్మాయిని తాను అనుకొనే వాడు జిను.

కానీ..ఎలా చెప్పాలి. చెబితే ఏమనుకుంటారననే సందేహం. టీచర్ కావాలని అనుకున్నా..తల్లిదండ్రుల కోరిక మేరకు త్రిసూర్ లోనే ఆయుర్వేదంలో 2013లో బేచిలర్ ఆఫ్ ఆయుర్వేదం చేశాడు. పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. దీని నుంచి తప్పించుకోవడానికి మంగళూరు వెళ్లి ఆయర్వేదంలో ఎం.డి చేశాడు. ఈ సమయంలోనే..మానసికంగా పూర్తిగా స్త్రీగా మారినా..అందరికోసం మగవాడిలో నడవడానికి..మాట్లాడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. 2018లో ఎండి పూర్తి చేసుకుని త్రిసూర్ వచ్చి..అక్కడి హాస్పిటల్ లో పని చేయసాగాడు.

ఇక అమ్మాయిగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు జెండర్ రీ అసెస్ మెంట్ సర్జరీ గురించి తెలుసుకున్నాడు. అమ్మాయిగా మారాలని అనుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇతని తల్లి తర్వాత అర్థం చేసుకుని సపోర్టు చేసింది. కానీ..పని చేస్తున్న హాస్పిటల్ లో ఏమంటారో..తాను ట్రీట్ చేస్తున్న పేషెంట్లు ఏమంటారో అనే భయం ఉండేది. ఇదే విషయాన్ని ఆసుపత్రి వారికి తెలియచేశాడు. దీనిని వారు స్వాగతించారు. అబ్బాయిగా వెళ్లి అమ్మాయిగా తిరిగి వస్తానని హాస్పిటల్ లో చెప్పాడు. అవసరమైన ఆరు సర్జరీలలో తల్లి పక్కనే ఉండి సాయం చేసింది. హాస్పిటల్ కు తిరిగి వచ్చాక…వెల్ కమ్ చెప్పారు. ఇప్పుడు తన మనస్సు శరీరం నాకు ఇష్టమైనట్లుగా మార్చుకుని కొత్త జీవితం ప్రారంభించానని అన్నాడు జిను శశిధరన్. డాక్టర్ ప్రియగా పేరు మార్చుకున్నాడు. గొంతుకు సంబంధించి, కాస్మొటిక్స్ సంబంధించి రెండు సర్జరీలు ఉన్నాయి..వాటి కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రియ వెల్లడించింది.