Buses for Sale: రూ.45 కేజీకి లగ్జరీ బస్సులను స్క్రాప్‌లో అమ్మకానికి పెట్టిన ట్రావెల్స్ యజమాని

కేరళలో పర్యాటక రంగం కుదేలవగా.. ట్రావెల్స్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కంపెనీలను మూసేసి ఉన్న వాహనాలను అమ్మేసుకుంటున్నారు.

Buses for Sale: రూ.45 కేజీకి లగ్జరీ బస్సులను స్క్రాప్‌లో అమ్మకానికి పెట్టిన ట్రావెల్స్ యజమాని

Kerala

Buses for Sale: కరోనా మహమ్మరి మనుషుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. మరికొన్ని రోజుల్లో తమ అదృష్టం మారిపోతుందని భావించిన వారి జీవితాలను అంధకారంలోకి నెట్టింది. జీవితంలో ముందుకు పోయే గమనాన్ని ఉన్నట్టుండి వెనక్కు నెట్టింది కరోనా. లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడిన కరోనా.. ఇప్పుడిపుడే కరుణిస్తుండడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే కొన్ని రంగాలపై మాత్రం కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. వాటిలో ప్రధానంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ పరిశ్రమ కరోనా కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది.

Also read: Tejas Aircraft: “సింగపూర్ ఎయిర్ షో-2022″లో తేజస్ యుద్ధ విమానాల ప్రదర్శన

కేరళలో పర్యాటక రంగం కుదేలవగా.. ట్రావెల్స్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కంపెనీలను మూసేసి ఉన్న వాహనాలను అమ్మేసుకుంటున్నారు. వాహనాలను కొనేందుకు ఎవరు ముందుకురాని పక్షంలో ఓ ట్రావెల్స్ యజమాని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన వద్దనున్న 10 లగ్జరీ ట్రావెల్స్ బస్సులను కేజీ రూ.45 చొప్పున స్క్రాప్ కింద అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. కేరళలోని కొచ్చికి చెందిన రాయ్సన్ జోసెఫ్ అనే వ్యక్తి కరోనాకు ముందు 20 బస్సులతో టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహించేవాడు. సీజన్‌నుబట్టి పర్యాటకులు కేరళకు వస్తుంటారు. ఆ సమయంలో 20 బస్సులు పర్యాటకులతో కళకళలాడేవి. తనతో పాటు మరో 50 మందికి జోసెఫ్ ఉపాధినిచ్చేవాడు.

Also read: Covid Vaccine: శాస్త్రవేత్తల సిఫార్సు ఉంటేనే 5-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్: కేంద్ర మంత్రి

అయితే కరోనా జోసెఫ్ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కేరళలో కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో.. పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గింది. ఉన్న కొద్ది మంది పర్యాటకులు..సొంత వాహనాల్లో వస్తుండడంతో ప్రైవేటు ట్రావెల్స్ కు గిరాకీ లేకుండా పోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో వాహనాలను అమ్ముకుంటున్నారు ట్రావెల్స్ యజమానులు. దీనికితోడు తనిఖీల పేరుతో స్థానిక పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయంటూ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో తన వద్ద 20 బస్సులు ఉండగా .. బిజినెస్ సరిగా లేక 10 బస్సులను అమ్మేశాడు జోసెఫ్. ఇక డిసెంబర్ – జనవరి మధ్య కాలంలో కేరళలో పర్యాటకం పుంజుకుంటుందని భావించినా..ఆశించిన ఫలితం కనిపించలేదు. సాధారణంగా డిసెంబర్ – జనవరి మధ్య రోజుకి కనీసం పది బస్సులు తిరుగుతుండగా.. ఈ ఏడాది మూడు బస్సులు కూడా నిండా లేదు. దానికి తోడు.. సిబ్బంది జీతభత్యాలు, వాహన ఇన్సూరెన్సులు, రోడ్డు టాక్స్ లు, రిపేర్ ఖర్చులు మొత్తం తడిసి మోపెడయ్యాయి. దీంతో గత్యంతరం లేని స్థితిలో జోసెఫ్ మిగిలిన 10 బస్సులను అమ్మకానికి పెట్టాడు.

Also read: Fire Accident: ప్రాణాలకు తెగించి తల్లి కూతురిని రక్షించిన కానిస్టేబుల్