బీజేపీ సీటిచ్చినా ఎన్నికల్లో పోటీకి నో చెప్పిన గిరిజన వ్యక్తి

రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అందులో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో వయనాడ్ జిల్లా నుంచి మనంతవాడి నియోజకవర్గానికి మణికందన్ సీ పేరును ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేకపోయినా..

బీజేపీ సీటిచ్చినా ఎన్నికల్లో పోటీకి నో చెప్పిన గిరిజన వ్యక్తి

Manikandan

Kerala tribal man: రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అందులో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో వయనాడ్ జిల్లా నుంచి మనంతవాడి నియోజకవర్గానికి మణికందన్ సీ పేరును ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేకపోయినా పానియా ట్రైబల్ కమ్యూనిటీ నుంచి మణికందన్ పేరు బయటకు వచ్చింది.

పైగా తాను బీజేపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించడానికి ముందు అంబేద్కర్ కొటేషన్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘నన్ను తలక్రిందులుగా ఉరి వేసినా నా ప్రజలకు ద్రోహం చేయను’ అని ఫేస్ బుక్ పోస్టులో రాసుకొచ్చాడు.

పోటీ చేయడానికి తనను బీజేపీ ఎంచుకున్నందుకు హ్యాపీగా ఉన్నానని.. పోటీకి నో చెప్పానని చెప్పానంటున్నాడు. కొందరు జిల్లా నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడం నీకు ఇంటరెస్ట్ గానే ఉందా అని అడిగారు. నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలిగా. ఇప్పుడే నాకు పోటీ చేయాలని లేదని చెప్పా. నా పేరు ప్రకటించేయడంతో నేనే పోటీ చేయడం లేదని చెప్పాల్సి వచ్చింది’ అని మణికందన్ అంటున్నారు.

మణికందన్ ఎంబీఏ పూర్తి చేసి కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా ట్రైబల్ కమ్యూనిటీ కోసం యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ట్రైబల్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) పాలసీలకు తాను వ్యతిరేకినని అంటున్నాడు.