కొవిడ్ పేషెంట్‌కు అంబులెన్స్ లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్

కొవిడ్ పేషెంట్‌కు అంబులెన్స్ లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్

COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నే రాసింది.

అది కూడా అంబులెన్స్ లో కూర్చుని పరీక్షకు అటెండ్ అయింది. ఏదైనా సమస్య ఉంటే ఎగ్జామ్ సరిగా రాయలేమనే అనుమానంతో మానేస్తుంటారు. తిరువనంతపురం నుంచి ఈ యువతి కొవిడ్ పాజిటివ్ అని తెలిసినప్పటికీ కలను సాకారం చేసుకోవడానికి అంబులెన్స్ లో కూర్చుని ఎగ్జామ్ రాసింది.



అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం గోపికా గోపన్ అనే యువతి పీఎస్సీ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఈ క్రమంలో ఆమెకు శనివారం పాజిటివ్ అని తేలింది. అయినప్పటికీ ఆమె ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయింది.

ఓ గవర్నమెంట్ స్కూల్ బయట ఎగ్జామ్ రాయడానికి అంబులెన్స్ లో డెస్క్ ఏర్పాటు చేశారు. కేరళ పోలీస్ సర్వీస్ కమిషన్ పరీక్షను నిర్వహించింది.

ఆ యువతి డెడికేషన్‌ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా కాంప్లిమెంట్ ఇచ్చారు. ‘ప్రతికూలతను కూడా ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమైంది. నా నియోజకవర్గ పరిధిలో ఉన్న గోపికా గోపన్‌కు సెల్యూట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

నిజానికి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ జులైలో జరగాల్సి ఉండగా వాయిదా పడింది.