Alappuzha: లాయర్ డిగ్రీ లేకుండానే బార్ ఎన్నికలలో గెలిచిన మహిళ!

కేరళ రాష్ట్రమంటే దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం. అందులో కూడా అలప్పుజ అంటే మరింత ప్రాధాన్యత గల నగరం. అలాంటి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓ మహిళ లైబ్రేరియన్ గా ఎన్నికయింది. కానీ, తీరా చూస్తే ఆమెకి అసలు లాయర్ డిగ్రీ కూడా లేదు.

Alappuzha: లాయర్ డిగ్రీ లేకుండానే బార్ ఎన్నికలలో గెలిచిన మహిళ!

Alappuzha

Alappuzha: కేరళ రాష్ట్రమంటే దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం. అందులో కూడా అలప్పుజ అంటే మరింత ప్రాధాన్యత గల నగరం. అలాంటి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓ మహిళ లైబ్రేరియన్ గా ఎన్నికయింది. కానీ, తీరా చూస్తే ఆమెకి అసలు లాయర్ డిగ్రీ కూడా లేదు. గత మూడేళ్లుగా ఆమె ఎలాంటి న్యాయ డిగ్రీ లేకుండానే మోసగిస్తూ చివరికి బార్ ఎన్నికల వరకు వచ్చి ఏకంగా లైబ్రేరియన్ గా కూడా ఎన్నికైంది.

అలప్పుజకు చెందిన ఓ మహిళ ఎల్‌ఎల్‌బి డిగ్రీ లేకుండా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ కాకుండానే మొత్తం న్యాయ వ్యవస్థ కళ్లుగప్పి రెండు సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసింది. ఈ సంవత్సరం ఏకంగా ఆమె బార్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ పడి లైబ్రేరియన్ గా ఎన్నికైంది. ముందుగా ఈ మహిళ అలప్పుజలోని ఒక ప్రసిద్ధ న్యాయవాది కార్యాలయంలో జూనియర్ న్యాయవాదిగా పనిచేయడం ద్వారా తన ప్లాన్ మొదలుపెట్టింది.

ఫైనల్ ఇయర్ ఎల్‌ఎల్‌బి విద్యార్థిని అని చెప్పుకుంటూ ఓ ప్రముఖ న్యాయవాది దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి తర్వాత అదే న్యాయవాది దగ్గర ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. ఆ తర్వాత 2019లో బార్ కౌన్సిల్‌లో చేరినట్లుగా అలప్పుజ బార్ అసోసియేషన్‌లోకి రావడానికి దరఖాస్తు చేసుకుంది. అయితే.. ఇంతలో జూలైలో బార్ అసోసియేషన్ కు ఒక లేఖ వచ్చింది. అందులో ఆ మహిళకు న్యాయ డిగ్రీ, రిజిస్ట్రేషన్ లేదని ఉండడంతో బార్ కౌన్సిల్ అప్రమత్తమైంది.

ముందుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్రమత్తమై అలప్పుజ నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది. బార్ కౌన్సిల్ లో చేరేందుకు దరఖాస్తులో ఆమె తిరువనంతపురంలోని మరో న్యాయవాదికి చెందిన ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఇచ్చినట్లుగా తేలగా.. జూలై 23న లొంగిపోయిన మహిళ బెయిల్ కోసం సెస్సీ కోర్టుకు హాజరైంది. అయితే, నాన్ బెయిలబుల్ కేసులు నమోదవడంతో ఆమె కోర్టు నుండి పారిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయినట్టుగా తెలుస్తుంది.