ప్రేమంటే ఇదే కదా….ఆ యువతిపై నెటిజన్ల ప్రశంసలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2020 / 01:47 PM IST
ప్రేమంటే ఇదే కదా….ఆ యువతిపై నెటిజన్ల ప్రశంసలు

కేరళ రాష్ట్రంలో మంగళవారం(మార్చి-3,2020) జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అన్ని పెళ్లిళ్లాగా అయితే దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ పెళ్లి కాదు. నిజమైన ప్రేమను తెలిపిన పెళ్లి ఇది. ప్రేమ అందం, ఆస్తులు, కులం, వయస్సు వేటినీ చూడదని నిరూపించిన పెళ్లి. దివ్యాంగుడైన యువకుణ్ని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకొని… అందరి చేతా శభాష్ అనిపించుకుంటోంది ఆ కేరళ యువతి.

త్రిసూర్‌ సిటీకి 25కిలీమీటర్ల దూరంలోని తాజేఘాట్‌కు చెందిన ప్రణవ్‌ కి ఆరేళ్ల క్రితం విద్యార్థిగా ఉన్న సమయంలో బైక్‌ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అన్నింటికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది. అయినప్పటికీ నిరుత్సాహపడని ప్రణవ్… అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తుండేవాడు. పండుగల్ని కళ్లారా చూసేవాడు. ప్రణవ్ ఫ్రెండ్ అతని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ప్రణవ్ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రణవ్ తల్లి తన కొడుకుకి అన్నం తినిపిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఆ పరిస్థితుల్లో తిరువనంతపురానికి చెందిన షహానా ఓ రోజు అనుకోకుండా ప్రణవ్‌ వీడియోలు చూసింది. అతని కాన్ఫిడెన్స్ నచ్చింది. ఫ్లైట్ ఎక్కి నేరుగా అతని దగ్గరికి వెళ్లింది. తర్వాత సోషల్ మీడియాలో అతడితో ఇంటరాక్ట్ అయింది. కొన్ని నెలల తర్వాత ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుంది. అతనిని ఫోన్‌ చేసి మాట్లాడింది. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ప్రణవ్‌కు తన ప్రేమ విషయాన్ని చెప్పిన షహానా… పెళ్లి చేసుకుందామంది.

అయితే మొదట ప్రణవ్… ఆ పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకోలేదు.నువ్వు చాలా మంచిదానివి. నా పరిస్థితి వేరు. నా లాంటి వాణ్ని చేసుకొని… నువ్వు సుఖంగా ఉండలేవు. ఇంకెవరినైనా చేసుకో… హాయిగా ఉండు అన్నాడు. అందుకు షహానా ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా… లేదంటే ఇలాగే ఉండిపోతా… నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడిగింది. నువ్వంటే ప్రాణం… బట్ అంటూ ఏదో చెప్పబోతుంటే ఇంకేం చెప్పొద్దు నేను మా పేరెంట్స్‌ని ఒప్పిస్తా అంది.

విషయం తెలిసిన వెంటనే ఆమె తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. అందమైన కేరళ కుందనపు బొమ్మవి. నువ్వేంటి… అతన్ని చేసుకుంటానంటావేంటి… వద్దు తల్లీ అని బతిమలాడారు. అందుకు షహానా ఒప్పుకోలేదు. నాకు లేని బాధ మీకెందుకు అని తల్లిదండ్రుల్ని ప్రశ్నించింది. ప్రేమంటే భౌతిక రూపంతో పనిలేదనీ… మనసులు కలిసేదే నిజమైన ప్రేమ అని చాటిచెప్పింది. ఆమె అంతలా ఇష్టపడుతుండటంతో… ఇక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా… ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొని ఒక్కటైంది. 

	pranav-shahna-2.jpg