ముగ్గురు కవలలకు ఒకేరోజు ఒకే వేదికపై వివాహాలు

  • Published By: Chandu 10tv ,Published On : October 26, 2020 / 01:38 PM IST
ముగ్గురు కవలలకు ఒకేరోజు ఒకే వేదికపై వివాహాలు

Kerala’s quintuplets : కేరళ తిరువనంతపురంలో శనివారం(అక్టోబర్ 24, 2020)న జరిగిన ఓ వివాహం కన్నుల విందుగా కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ విషయం గురించే ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఒకే వేదికపై ఒకే రోజు ఒకేసారి ముగ్గురు కవలల వివాహం జరగటంతో వేదిక మొత్తం ఆహ్లాదంగా కనిపించగా.. ఆ ముగ్గరు కవలలు ఎరుపు రంగు కాంచీపురం పట్టు చీరలు ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ ముగ్గురి వివాహం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా జరిగింది.



వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన రమాదేవి అనే మహిళ 1995వ సంవత్సరంలో నవంబరు 18న ఒకే కాన్సులో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.

వారిలో నలుగురు ఆడపిల్లలు కాగా, ఒకరు మగ పిల్లవాడు. ఈ పిల్లలు కేరళ క్యాలండర్ ప్రకారం ఉత్తమ్ నక్షత్రంలో పుట్టడంతో వీరికి దేవి, ప్రేమ్ కుమార్ దంపతులు ఉత్తర, ఉత్తమ, ఉత్రా, ఉత్రజా, ఉత్రాజన్ అనే పేర్లు పెట్టుకున్నారు.


https://10tv.in/kerala-gov-becomes-first-state-to-set-base-prices-for-16-varieties-of-vegetables-and-fruits/
వీరు ఎంతో ఆరోగ్యంగా పెరిగి పెద్దవగా.. వీరిని స్థానికులు వింతగా చూస్తుండేవారు. వీరు పెరిగి పెద్దవగా.. కవలల్లో నలుగురు అమ్మాయికి గతేడాది వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. నలుగురు కుమార్తెల వివాహాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరపాలని నిశ్చియించగా.. లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు.



చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వీరి జీవితంలో జరిగిన అన్ని కథనాలు వార్తా పత్రికల్లో తరచూ కనిపిస్తూ ఉండేవి. వారి మెుదటి పుట్టనరోజు వేడుక, పాఠశాలలో మెుదటి రోజు అన్ని మీడియాలో వస్తూనే ఉన్నాయి. వీరికి పదేళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోగా.. వీరిని తల్లి రమాదేవి ఎంతో కష్టపడి పెంచి పోషించింది. గొప్ప చదువులు చదివించింది.



ఈ క్రమంలోనే ఆ నలుగురు కవలల పెళ్లిళ్లు నిశ్చయించగా.. లేటెస్ట్‌గా ముగ్గురికి ఒకే వేదికపై వివాహం జరిగింది. నలుగురు యువతులకూ ఒకేసారి నిశ్చితార్థం జరిగినప్పటికీ ప్రస్తుతం ముగ్గురికి మాత్రమే వివాహం జరిగింది. ఇంకొక యువతిని పెళ్లి చేసుకోబోయే వరుడు కువైట్ నుంచి సమయానికి రాలేకపోవడం వల్ల ఆమె వివాహం జరగలేదు. ఆమె వివాహం నవంబర్ లో జరగవచ్చునని కుటుంబ సభ్యులు వెల్లడించారు.



ఒకేసారి తమ ముగ్గురు కూతుర్లకు పెళ్లి జరగడంతో తల్లి రమాదేవి ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో వీరిని పెంచి పోషించటం తనకు ఎంతో కష్టంగా మారింది. అయితే తర్వాతి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వారిని పెంచి పోషించినట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం వారందరూ మంచి ఉద్యోగాలు సంపాదించి, జీవితంలో స్థిరపడ్డారు. ఇంకా తమ నలుగురు కుమార్తెలకు ఉద్యోగంలో స్థిరపడిన భర్తలు దొరికారని ఆమె చెప్పుకొచ్చారు.