Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌

ఒక కుటుంబంలో మరొకరు కూడా రాజకీయంగా కొనసాగుతూ ఉంటే... ఐదేళ్లు పాటు పార్టీ కోసం సంస్థాగతంగా పని చేయాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాతే టికెట్‌ పొందేందుకు అర్హులు అని పేర్కొన్నారు.

Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌

Congress

Congress party : పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కాంగ్రెస్‌ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థాగత వ్యవహారాలపై ఏర్పాటైన కమిటి చేసిన సిఫారసులకు సిడబ్ల్యూసి ఆమోదం తెలిపింది. సంస్థాగత అంశాలకు సంబంధించిన ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ వివరాలను అజయ్‌ మాకెన్‌ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో బ్లాక్‌ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పార్టీని సమర్ధవంతంగా నిర్వహించేందుకు బ్లాక్‌ కాంగ్రెస్‌తోపాటు మండల కాంగ్రెస్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో మూడు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజా అంతర్‌దృష్టి విభాగం… విధాన రూపకల్పన కోసం… దీని ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.

జాతీయ శిక్షణా సంస్థ ఏర్పాటు… పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై సమగ్ర శిక్షణ కోసం కొత్త సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి సంస్థ ప్రారంభం కానుందని చెప్పారు. ఎఐసిసి స్థాయిలో ఎన్నికల నిర్వహణ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో…. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కొత్త విభాగం ఉపయోగపడనుందని వెల్లడించారు. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎఐసిసి నుంచి జిల్లా స్థాయి వరకు ఆఫీస్‌ బేర‌ర్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన చేస్తామని చెప్పారు.

Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ

ఉత్తమ పనితీరు కనబరిచే వారికి పదోన్నతి, పని చేయని వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయించామని తెలిపారు. ఒక వ్యక్తి ఐదేళ్లకు మించి పదవిలో కొనసాగడంపై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం ప్రకటించింది. 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు పార్టీలోని అన్ని విభాగాల్లో 50 శాతం ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు… ఎస్సీ, ఎస్టి, ఓబిసి, మైనారిటీలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ నిబంధనను కాంగ్రెస్‌ అమల్లోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ఒక కుటుంబంలో మరొకరు కూడా రాజకీయంగా కొనసాగుతూ ఉంటే… ఐదేళ్లు పాటు పార్టీ కోసం సంస్థాగతంగా పని చేయాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాతే టికెట్‌ పొందేందుకు అర్హులు అని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతాల కోసం ఏర్పాటైన… నార్త్‌ఈస్ట్‌ సమన్వయ కమిటి ఛైర్మన్‌ సిడబ్ల్యూసికి శాశ్వత ఆహ్వానితుడిగా మార్పు చేసినట్లుగా తెలిపారు. జాతీయ స్థాయిలో సిడబ్ల్యూసి స్థాయిలో పార్టీ అధ్యక్షుడికి సహాయకారిగా ఉండేలా… ఒక ప్రత్యేక కమిటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి స్థాయిలో… ఒక రాజకీయ వ్యవహారాల కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి ఒక సారి ఎఐసిసి స్థాయి నుంచి బ్లాక్‌ స్థాయి వరకు విస్తృత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.