రైతులను కలిసి సపోర్ట్ తెలియజేసిన ఢిల్లీ సీఎం

రైతులను కలిసి సపోర్ట్ తెలియజేసిన ఢిల్లీ సీఎం

ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను కలిసి మద్ధతు తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్ధతుగా దేశవ్యాప్తంగా మంగళవారం భారత్ బంద్ చేపట్టనున్నారు.

ఈ క్రమంలోనే దేశ వ్యాప్త బంద్‌కు ఆప్ తమ మద్ధతు వ్యక్తం చేస్తుందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ రైతులను కలిసి వారికి స్పష్టం చేశారు.



‘నేను ఇక్కడకు సీఎంగా రాలేదు. మీ సేవకుడిగా వచ్చాను. మా పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు ఎప్పటి నుంచో మీకు సేవకులు. ఈ రోజున రైతులు సమస్యల్లో ఉన్నారు. వారికి సపోర్ట్ గా నిలబడతాం. ఈ క్రమంలోనే డిసెంబర్ 8న చేపట్టనున్న భారత్ బంద్ కు సపోర్ట్ ఇస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ వర్కర్లు ఇందులో పాల్గొంటారు’ అని సింగు బోర్డర్ లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.

సినీ ప్రముఖులు సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రాలు సైతం సోషల్ మీడియా ద్వారా రైతులకు సపోర్ట్ తెలియజేశారు. మన రైతులు ఇండియాకు ఆహారం అందించే సైనికులు అంటూ పోస్టులు పెట్టారు.