Australia: ఖలిస్తాన్ మద్దతుదారుల అరాచకం.. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కొంతకాలం నుంచి అక్కడ ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయులు ఒక నిరసన చేపట్టారు. మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్ద ప్రభుత్వ అనుమతితో భారతీయులు నిరసన చేపట్టారు.

Australia: ఖలిస్తాన్ మద్దతుదారుల అరాచకం.. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి

Australia: ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారులు అరాచకానికి పాల్పడ్డారు. భారతీయులపై దాడికి పాల్పడ్డారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కొంతకాలం నుంచి అక్కడ ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

దీన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయులు ఒక నిరసన చేపట్టారు. మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్ద ప్రభుత్వ అనుమతితో భారతీయులు నిరసన చేపట్టారు. అలాగే ఖలిస్తాన్ ఏర్పాటుపై రెఫరెండం కూడా నిర్వహించాలనుకున్నారు. దీనికోసం భారతీయులు మన జాతీయ జెండాలు చేతబట్టుకుని నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సమయంలో అక్కడి ఖలిస్తాన్ మద్దతు దారులు ఆ ప్రదేశానికి చొచ్చుకొచ్చారు. ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని, భారతీయులపైకి దూసుకొచ్చారు. భారత జాతీయ జెండాలు పట్టుకున్న వారిపై రాడ్లతో దాడి చేశారు. కత్తులతో బెదిరించారు. మన జెండా కర్రల్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడటంతో వెంటనే స్థానిక పోలీసులు స్పందించారు.

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు.. హరీష్ శంకర్ సంచలన కామెంట్స్..

ఘర్షణ పెద్దది కాకుండా నియంత్రించారు. ఘటనకు బాధ్యులైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిపై కేసు నమోదు చేశారు. విధ్వంసానికి పాల్పడినందుకు కొందరికి జరిమానా కూడా విధించారు. ఈ ఘటనపై బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిశ్రా స్పందించారు. ఇండియాకు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతుదారులు చేసిన విధ్వంసాన్ని ఖండించారు. ఇలాంటి ఘటనలు భారతీయుల మధ్య ఘర్షణలు పెంచి, విబేధాలకు కారణమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.