Kidnapped Kid: తొమ్మిదేళ్ల తర్వాత బాలికను కుటుంబంతో కలిపిన మిస్సింగ్ పోస్టర్

ఓ డిజిటల్ కాపీ.. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన చిన్నారిని ఆ కుటుంబానికి మళ్లీ చేరువ చేసింది. 2013లో టీనేజ్ గర్ల్ మిస్ అయింది. ఏడు సంవత్సరాలున్న పూజ 2013లో జనవరి 22న స్కూల్ కు వెళ్లింది. ముంబైలోని అంధేరీలో సోదరుడితో కలిసి వెళ్లిన ఆమెను హెన్రీ జోసెఫ్ డిసౌజా ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు.

Kidnapped Kid: తొమ్మిదేళ్ల తర్వాత బాలికను కుటుంబంతో కలిపిన మిస్సింగ్ పోస్టర్

Waiter Kidnap

 

 

Kidnapped Kid: ఓ డిజిటల్ కాపీ.. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన చిన్నారిని ఆ కుటుంబానికి మళ్లీ చేరువ చేసింది. 2013లో టీనేజ్ గర్ల్ మిస్ అయింది. ఏడు సంవత్సరాలున్న పూజ 2013లో జనవరి 22న స్కూల్ కు వెళ్లింది. ముంబైలోని అంధేరీలో సోదరుడితో కలిసి వెళ్లిన ఆమెను హెన్రీ జోసెఫ్ డిసౌజా ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు.

అప్పట్లో తనకు పిల్లలు లేకపోవడంతో పెంచుకుందామని తీసుకుపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ఎవర్నీ గుర్తు పట్టకపోతుండటంతో కర్ణాటకలోని హాస్టల్ లో చేర్చి ఎన్నీ డిసౌజాగా పేరు మార్చారు. వారికి పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. 16ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ బాలిక కుటుంబ సభ్యుల్ని పోల్చుకోలేకపోతుంది.

ఓ రోజు మద్యం మత్తులో హెన్రీ ఆమెకు నిజం చెప్పేశాడు. బాలిక తన కూతురు కాదని చెప్తూనే తాను కూడా వెదుకుతున్నానని వివరించాడు. అలా 2013లో పూజా మిస్సింగ్ అనే పోస్టర్ బాలికతో పాటు మరో ఫ్రెండ్‌కు కనిపించింది. అందులో ఉన్న ఐదుగురిని ఎంక్వైరీ చేయగా, అదృష్టవశాత్తు ఒకరు కాంటాక్ట్ లోకి వచ్చారు.

Read Also : 15 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన వివాహిత

ఆశ్చర్యపోయిన రఫిక్.. బాలిక కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. వీడియో కాల్ లో ఆమెను పోల్చుకోవడమే కాకుండా నిజమైన తల్లితో మాట్లాడేందుకు ఏర్పాటు చేశాడు. వెంటనే అన్ని సంవత్సరాల క్రితం మిస్ అయిన కూతుర్ని పోల్చుకోగలిగింది ఆమె తల్లి. వీడియో కాల్ లో చూస్తుండగానే కన్నీరు కార్చేసింది.

ఆ తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. 16ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో బాలిక అసలైన తండ్రి మరణాన్ని కూడా తెలుసుకోలేకపోయింది. స్కూల్ నుంచి కిడ్నాప్ కు గురైన ఆ రోజును తల్చుకుంటూ కన్నీరు కార్చింది పూజ.

హెన్రీను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. అతని భార్యను కూడా ఈ నేరంలో భాగం చేశారు.