Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో

భారత్ లో అంబాసిడర్ కార్లను తయారు చేసిన హిందూస్తాన్ మోటార్స్..తమ అంబాసిడర్ బ్రాండ్ ను తిరిగి దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో

Ambassador

Ambassador Car: ఇండియాస్ ఐకానిక్ కార్, భారత్ లో కార్ల రారాజుగా వెలుగొందిన అంబాసిడర్ కార్లు తిరిగి త్వరలో రోడ్లపైకి రానున్నాయి. మీడియా కధనాల ప్రకారం..భారత్ లో అంబాసిడర్ కార్లను తయారు చేసిన హిందూస్తాన్ మోటార్స్..తమ అంబాసిడర్ బ్రాండ్ ను తిరిగి దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే గతంలో మాదిరిగా కంబషన్ మోటార్ ఇంజిన్లతో కాకుండా ఈసారి ఎలక్ట్రిక్ మోడల్ ను తెచ్చే ప్రయత్నాల్లో ఉంది హిందూస్తాన్ మోటార్స్. ఈమేరకు ఫ్రాన్స్ కి చెందిన ప్యుగోట్(Peugeot) మోటార్స్ తో హిందూస్తాన్ మోటార్స్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ముందుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. దాదాపు 65 ఏళ్ల పాటు భారత్ లో రారాజుగా వెలుగొందిన అంబాసిడర్ కారుకు 1970-80లలో 70 శాతం మార్కెట్ వాటా ఉండేది.

Other Stories: Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు

ఈక్రమంలో 80వ దశకంలో వచ్చిన మారుతీ కార్లు వినియోగదారులను అక్కటుకోవడంతో అంబాసిడర్ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. హిందుస్థాన్ మోటార్స్ కు చెన్నై ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, పశ్చిమబెంగాల్ లోని ఉత్తరపరలో మరొక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండేవి. వీటిలో చెన్నై ప్లాంట్ లో మిత్సుబిషి కార్లను తయారు చేయగా..ఉత్తరపర ప్లాంట్ లో అంబాసిడర్ మరియు ఇతర చిన్న తరహా వాణిజ్య వాహనాలను తయారు చేసేవారు. చివరగా 2014లో ఉత్తరపర ప్లాంట్ లో అంబాసిడర్ కారును తయారు చేసిన హిందూస్తాన్ మోటార్స్..2017లో ఆ బ్రాండ్ ను రూ.80 కోట్లకు ఫ్రెంచ్ సంస్థ ప్యుగోట్(Peugeot)కు..అమ్మేసింది. ఇప్పుడు అదే సంస్థతో కలిసి భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది హిందూస్తాన్ మోటార్స్.