Kiran Bedi: హెలికాప్టర్ పై దాడి చేసిన తిమింగళం వీడియో షేర్ చేసిన కిరణ్ భేడీ

పుదుచ్చేరీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తిమింగళం నీళ్లలో నుంచి ఎగిరి హెలికాప్టర్ ను అందుకుని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్న వీడియో అది.

Kiran Bedi: హెలికాప్టర్ పై దాడి చేసిన తిమింగళం వీడియో షేర్ చేసిన కిరణ్ భేడీ

Kiran Bedi

 

 

Kiran Bedi: పుదుచ్చేరీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తిమింగళం నీళ్లలో నుంచి ఎగిరి హెలికాప్టర్ ను అందుకుని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్న వీడియో అది. దాని కింద నేషనల్ జియోగ్రాఫిక్ వీడియో హక్కుల కోసం మిలియన్ డాలర్లు వెచ్చించిందంటూ అందులో టెస్ట్ రాసుకొచ్చారు.

వీడియోలో నమ్మలేనంత ఎత్తుకు ఎగిరింది తిమింగళం. అక్కడే కొందరు షిప్ లో నిలబడి చూస్తుండగా ఈ ఘటన జరిగింది. నీటి మీద కాస్త ఎత్తులో ఉన్న హెలికాప్టర్‌ను అందుకుని నీళ్లలోకి లాగేసుకుంది. మంటలతోనే మునిగిపోయింది హెలికాప్టర్. ఈ వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

కిరణ్ బేఢీ షేర్ చేసిన వీడియోలు ట్రోలింగ్ గురికావడం కొత్తేం కాదు. జనవరి 2020లో, ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక నకిలీ వీడియోను షేర్ చేసింది. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా రికార్డ్ చేసిన సూర్యుని ధ్వనిలో “ఓం” శబ్ధాలు వినిపిస్తున్నాయని పేర్కొంది.

తెలంగాణ గవర్నర్‌కు ఎక్స్‌ట్రా పవర్స్.. పుదుచ్చేరిలో కూడా

2017లో, ఒక వృద్ధురాలు డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది , “97 ఏళ్ల వయస్సులో దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడండి.. నరేంద్రమోడి తల్లి హీరాబెన్ మోడీ వీడియో అది” కాసేపటికి ఆ ట్వీట్ సరిచేసుకున్నారు కిరణ్ భేడీ.