Kite String: స్కూటీపై వెళ్తుండగా గాలిపటం దారం మెడకు చుట్టుకుని యువతి మృతి

గాలిపటం ఎగరేసుందుకు వాడే దారం (మాంజా) మెడకు చుట్టుకుని 20ఏళ్ల యువతి ప్రాణం పోయింది. చైనీస్ మాంజా అని పిలిచే దారానికి పవర్డ్ గ్లాస్ కూడా ఉంటుందని అదే ప్రాణం తీసిందని స్థానికులు...

Kite String: స్కూటీపై వెళ్తుండగా గాలిపటం దారం మెడకు చుట్టుకుని యువతి మృతి

Chinease Manja

Kite String: గాలిపటం ఎగరేసుందుకు వాడే దారం (మాంజా) మెడకు చుట్టుకుని 20ఏళ్ల యువతి ప్రాణం పోయింది. చైనీస్ మాంజా అని పిలిచే దారానికి పవర్డ్ గ్లాస్ కూడా ఉంటుందని అదే ప్రాణం తీసిందని స్థానికులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.

మాధవ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని జీరో పాయింట్ బ్రిడ్జ్ వద్ద మహిళ స్నేహితురాలితో కలిసి స్కూటర్ మీద వెళ్తుంది. గాల్లో ఎగురుతున్న గాలిపటం దారం మెడకు తగిలింది. స్కూటర్ వేగానికి గొంతు వద్ద చర్మం కట్ అయి రక్తస్రావం అయింది. వెనుక కూర్చొన్న స్నేహితురాలు సేఫ్ గానే ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఆ సమయంలో గాలి పటం ఎగరేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : పరువు నష్టం దావా వేసిన సల్మాన్

పవర్డ్ గ్లాస్ కోటింగ్ ఉండే చైనీస్ మాంజా అమ్మకంపై నిషేదం ఉన్నప్పటికీ అమ్ముతున్న వారిపైనా, సప్లయిర్స్ పైనా యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఎగురుతున్న గాలిపటాల దారాలను తెంచేక్రమంలో ఇటువంటివి వాడుతున్నారని.. వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు.