KK Shailaja : కరోనా కట్టడిలో ప్రశంలందుకున్న కేకే శైలజకు కేరళ కొత్త కేబినెట్ లో దక్కని చోటు

కే శైల‌జ‌… క‌రోనా వైర‌స్ దేశంలోకి ప్రవేశించిన మొద‌ట్లో అద్భుతంగా ప‌నిచేసింద‌ని పేరొచ్చిన మంత్రి.

KK Shailaja : కరోనా కట్టడిలో ప్రశంలందుకున్న కేకే శైలజకు కేరళ కొత్త కేబినెట్ లో దక్కని చోటు

Kk Shailaja

KK Shailaja కేకే శైల‌జ‌… క‌రోనా వైర‌స్ దేశంలోకి ప్రవేశించిన మొద‌ట్లో అద్భుతంగా ప‌నిచేసింద‌ని పేరొచ్చిన మంత్రి. కేర‌ళలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌ను, అంటువ్యాధుల‌తో పాటు క‌రోనా కేసుల‌ను కట్టడి చేసి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని దేశం అంతా కొనియాడింది. కేర‌ళ‌లో క‌రోనా క‌ట్ట‌డికి అవిశ్రాంతంగా ప‌ని చేసి అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకున్న ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌కు చుక్కెదురైంది.

రెండోసారి వ‌రుస‌గా కేర‌ళ‌లో అధికారంలోకి వ‌చ్చిన లెఫ్ట్ కూట‌మి ప్ర‌భుత్వంలో కేకే శైల‌జ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. మే 20న కేరళలో కొలువుదీరనున్న కొత్త కేబినెట్‌లో శైలజకు చోటు ద‌క్క‌లేద‌ని స‌మాచారం. ఆమెకు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌కుండా పార్టీ విప్‌గా నియ‌మిస్తార‌ని తెలుస్తోంది. గ‌త క్యాబినెట్ లో మంత్రులుగా ప‌నిచేసిన వారికి ప‌ద‌వులు ఇవ్వొద్ద‌న్న సీపీఎం నిర్ణ‌యంతో ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌టం లేదని తెలుస్తోంది.

మే 20వ తేదీన కొత్త మంత్రివ‌ర్గం కొలువుదీరనున్నట్లు ఎల్డీఎఫ్ ప్ర‌క‌టించింది. వ‌రుసగా రెండోసారి సీఎంగా ఈనెల 20న పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నుండ‌గా… 11మంది కొత్త వారికి మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారు. అయితే మొదట ఆ జాబితాలో కేకే శైల‌జ పేరు కూడా ఉంది. ఆరోగ్య మంత్రిగానే కొన‌సాగుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత మార్పులు చేర్పులు చేసిన క్ర‌మంలో శైల‌జ‌కు కేబినెట్‌లో స్థానం ద‌క్క‌లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా,శైల‌జ టీచ‌ర్ గా పేరున్న ఆమెను గతేడాది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది. క‌రోనా వైర‌స్‌నే కాదు నిఫా వైర‌స్‌ను కూడా ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొగ‌లిగిన విషయం తెలిసిందే.