Delhi Jail Knives, Mobile Phones : ఢిల్లీ జైలులో ఖైదీల వద్ద కత్తులు, మొబైల్ ఫోన్లు లభ్యం

ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Delhi Jail Knives, Mobile Phones : ఢిల్లీ జైలులో ఖైదీల వద్ద కత్తులు, మొబైల్ ఫోన్లు లభ్యం

Delhi Jail Knives, Mobile Phones : ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. ఢిల్లోని మండోలి జైలులో ఖైదీలు నిషేధిత వస్తువులను కలిగి ఉన్నట్లు ఉన్నత అధికారులకు సమాచారం అందింది. దీంతో జైలు వార్డుల్లో తనిఖీలు చేయాలని జైలు సూపరింటెండెంట్ లకు జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ బనివాల్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో జైలు వార్డుల్లో తనిఖీలు చేయగా జనవరి 3న జైలు నెంబర్ 8,9 లోని ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లతో పాటు నిషేధిత వస్తువులను గుర్తించారు. ఏడు మొబైల్ ఫోన్లు, మూడు కత్తులు, ఒక గది హీటర్, మరో ఆరు హీటర్లు, ఒక మొబైల్ ఫోన్ చార్జర్, రెండు పెన్ డ్రైవ్ లు, రెండు నీటి కెటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Fatehgarh Jail : జైలుకి నిప్పంటించి,రాళ్లు విసిరన ఖైదీలు..30మంది పోలీసులకు గాయాలు

గత 15 రోజుల్లో జైలులో 117 మొబైల్ ఫోన్స్ తోపాటు ఇతర వస్తువులు లభించాయి. దీంతో ఐదుగురు జైలు అధికారులపై చర్యలు తీసుకున్నారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ, ధర్మేందర్ మౌర్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సన్నీ చంద్ర, హెడ్ వార్డర్ లోకేష్ ధామా, వార్డర్ హన్సరాజ్ మీనాను సస్పెండ్ చేశారు.