సమగ్ర సమాచారం మీ కోసం : గ్రేట్ ఇండియన్ ఎలక్షన్

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.

  • Published By: sreehari ,Published On : March 9, 2019 / 10:47 AM IST
సమగ్ర సమాచారం మీ కోసం : గ్రేట్ ఇండియన్ ఎలక్షన్

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్ లేదా, మే నెలలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ మళ్లీ అధికారం పీఠం ఎక్కాలని భావిస్తోంది. పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. 130 కోట్ల మంది జనాభా గల దేశంలో సార్వత్రిక ఎన్నికలు దశలు వారీగా జరుగునున్నాయి. కోట్లాది మంది ప్రజలు తమ ఓటుతో నేతల రాతను మార్చనున్నారు.

2014 జనరల్ ఎలక్షన్.. ECI డేటా గణాంకాలివే.. 
ఇప్పటివరకూ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎం మిషన్లు వచ్చాక ఓట్ల కౌటింగ్ విధానం ఎంతో సులభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కూడా అందుకు తగట్టుగా ఎన్నికల సరళిని అమలు చేస్తూ వస్తోంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. ఎంతమంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు..2014 సార్వత్రిక ఎన్నికల కోసం న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ అథారిటీ, 300 మందికి పైగా అధికారులు ఎన్నికల కోసం ఫుల్ టైమ్ పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర సమగ్ర సమాచారం ఏంటో తెలుసుకుందాం రండి.. 
Read Also : అమ్మ పోయాక మోడీనే నాన్నయ్యారు

83 కోట్ల మంది ఓటర్లు  :
2014 ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 83 కోట్లకు పైగా భారతీయ ఓటర్లు తమ ఓటు హక్కును పొంది ఉన్నారు. యూనైటెడ్ స్టేట్స్ లో 2017 ఏడాది ఓటింగ్ సంఖ్య కంటే మూడు రెట్లుకు పైనే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 55.3 కోట్ల మంది భారతీయులు (66 శాతం మంది మాత్రమే) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 8వేల 251 మంది అభ్యర్థులు 460 పొలిటికల్ పార్టీల నుంచి ఉన్నారు. పార్లమెంటులోని లోక్ సభ (దిగువ సభ)లో మొత్తం 545 స్థానాలు ఉండగా.. 543 స్థానాల్లో పోటీ వాతావరణం ఉంది. ఇందులోని రెండు సీట్లు మాత్రం రిజర్వ్ కేటగిరీకి చెందినది. అంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందిన సీట్లు. ఈ రెండు సీట్లకు సభ్యులను స్వయంగా భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈసీ డేటా ప్రకారం.. 2014 ఎన్నికల్లో సగటుగా ఒక్కో నియోజకవర్గంలో  15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో ఒక సీటుకు అత్యధికంగా 42 మంది పోటీ పడ్డారు. 

రోడ్డు, పడవ, ఏనుగులపై పోలింగ్ కేంద్రాలకు..
2014లో దేశవ్యాప్తంగా ఈసీఐ 927వేల 553 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో సగటున 900 మంది ఓటర్లు ఉన్నారు. ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం.. పోలింగ్ స్టేషన్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఏ ఓటర్ ఉండకూడదు. ఎన్నికల పోలింగ్ కోసం భద్రత బలగాలను దాదాపు 5 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు, భద్రత బలగాలను మోహరించారు.
Read Also : చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

కాలినడకన, రోడ్డురవాణా, ప్రత్యేక రైళ్లు, హెలికాప్టర్, పడవ, కొన్నిసార్లు ఏనుగులపై పోలింగ్ స్టేషన్లకు తరలించారు. కొన్ని సౌకర్యాలు మాత్రమే ఉన్న రిమోట్ ఏరియాల్లో ఇలా అధికారులు, పోలీసులను మోహరించారు. మొబైల్ కనెక్ట్ విటీ సరిగా లేని ప్రాంతాల్లో 80 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు 20వేలు అడవిలో, సెమీ ఫారెస్ట్ ఏరియాలు ఉన్నట్టు ఈసీ గత ఏడాది రిలీజ్ చేసిన డేటాలో వెల్లడించింది.   

ఒక ఓటర్ కోసం పోలింగ్.. 
2009 సార్వత్రిక ఎన్నికల్లో ఈసీఐ.. గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ లో పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. సింహాలకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతంలో ఒక ఓటర్ కోసం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 

ఎన్నికలకు మొత్తం ఖర్చు 55.2 కోట్లు
సార్వత్రిక ఎన్నికల్లో పలు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. మళ్లీ అదే ప్రాంతాల్లో అధికారులు, భద్రత బలగాలను మోహరించి ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెలకు పైగా ఈసీ నిర్వహించింది. ఒక రోజులో 543 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణతో మొత్తం ప్రక్రియకు అయిన ఖర్చు  38.7 బిలియన్లు రూపాయలు (552 మిలియన్లు) అంటే.. 55.2 కోట్లు అయినట్టు ఈసీఐ అంచనా వేసింది. 

EVM ఓటింగ్ పై వివాదం.. 
1982లో తొలిసారి ఇండియాలో ఈవీఎం ఓటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎన్నికల్లో ఈవీఎంతో ఓటింగ్ విధానం అమల్లోకి తెచ్చాక ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయింది. ఈవీఎంలపై ఓటింగ్, ఆ తర్వాత ఓట్లు లెక్కించడం సులభంగా మారింది. అయితే.. ఎన్నికల సమయంలో ఈవీఎం విధానంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈవీఎం ఓటింగ్ విధానంతో ట్యాంపరింగ్ జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవీఎం మిషన్ల వాడకంపై వివాదానికి తెరలేచింది.

18 లక్షల ఈవీఎంల వినియోగం..
ఇటీవల కాలంలో ఈవీఎం మిషన్లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించడంపై విపక్ష పార్టీల నుంచి ఈసీకి ఒత్తిడి ఎదురైంది. 2014లో సార్వత్రిక ఎన్నికల సమయంలో 18లక్షల ఈవీఎంలను ఎన్నికల కోసం  వినియోగించుకున్నారు. ఓటర్ వెరిఫైయిడ్ పేపర్ అడిట్ ట్రయల్ (VVPAT)సిస్టమ్ లో ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని విపక్షాలు ఈసీకి దృష్టికి తెచ్చిన సందర్భాలు కూడా అనేకం.. 

నిజానికి వీవీప్యాట్ డివైజ్ ఈవీఎం మిషన్ కు ఎటాచ్ చేయడంతో ఓటు గుర్తుతో కూడిన స్లిప్ ఫ్రింట్ అవుతుంది. దీనిపై అభ్యర్థి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓటు వేసే సమయంలో ఓటరుకు కనిపిస్తుంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈసీఐ ఓట్లను వెరిఫై చేస్తుంది. ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ ఆరోపణలపై గత ఫిబ్రవరిలో ఈసీఐ అధికారులు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.  
Read Also : పిల్లులను పట్టుకుంటే.. లక్ష రూపాయలిస్తాం