PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్‌ చెక్కపెట్టె’ గురించి తెలుసా

ఈ బహుమతులలో వేటికవే ప్రత్యేకత ఉన్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. జపాన్ ప్రధాని ఫుమియో కీషీదాకు ఇచ్చిన 'రోగన్ పెయింటింగ్‌ కలిగిన చెక్కపెట్టె'గురించే

PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్‌ చెక్కపెట్టె’ గురించి తెలుసా

Modi1

PM Modi Gift: జపాన్ లో రెండు రోజుల క్వాడ్ కూటమి సమావేశాలు ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా..దేశీయంగా పెట్టుబడుల అవకాశాలు, భారత్ తో వాణిజ్యం, సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత వంటి విషయాలపై క్వాడ్ దేశాధినేతలతో చర్చించారు ప్రధాని మోదీ. కాగా తరచూ విదేశాల్లో అధికారిక పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీ..అక్కడి దేశాధినేతలకు బహుమతులు అందిస్తుంటారు. ప్రస్తుత పర్యటనలోనూ జపాన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీలకు ఎంతు అపురూపమైన బహుమతులు అందించారు మోదీ. ఈ బహుమతులలో వేటికవే ప్రత్యేకత ఉన్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. జపాన్ ప్రధాని ఫుమియో కీషీదాకు ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్‌ కలిగిన చెక్కపెట్టె’గురించే.

other stories:Bihar : పెళ్లి ప‌త్రిక‌ల‌పై క‌ట్నం తీసుకోవ‌డం లేద‌ని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా..: సీఎం నితీశ్ కుమార్

ఎందుకంటే..భారత సంప్రదాయ కళలకు రంగులద్దే ప్రక్రియతో తయారు చేసిన ఇటువంటి చెక్కపెట్టె విలువ కట్టలేనిది. రోగాన్ పెయింటింగ్ సాధారణంగా ముదురు రంగుల గుడ్డపై ఘాటైన రంగులు కనిపించేలా తయారు చేస్తారు. ఆముదం నూనేను (చేతితో కొట్టిన ఆముదం గింజల నుండి సేకరించినది) కొన్ని రోజుల పాటు మరిగించి, ఆపై దానికి వెజిటబుల్ పిగ్మెంట్ మరియు బైండింగ్ ఏజెంట్‌ను జోడించడం ద్వారా మందపాటి మెరిసే పెయింట్ తయారు చేయబడుతుంది. ఈ మందపాటి ముద్దలు ఎండిపోకుండా ఉండేందుకు మట్టి కుండలలో నిల్వ ఉంచుతారు. అనంతరం కల్లమ్ లేదా ఇనుప కడ్డీని ఎడమ చేతి వేళ్ల సపోర్టుతో క్లాత్‌పై సగం డిజైన్‌ను పెయింట్ చేసి, ఆపై గుడ్డకు రెండు వైపులా నొక్కడం ద్వారా మిగిలిన సగం వస్త్రంపై అంటుకునేలా చేస్తారు.

Other stories:Sugar mountains : సముద్ర గర్భంలో పంచదార కొండలను కనుగొన్న పరిశోధకులు..

గుజరాతీల సంప్రదాయ కళ అయిన ఈ రోగన్ పెయింటింగ్‌ ను 100 ఏళ్ల క్రితం వరకు సంప్రదాయ గుజరాతీలు వాడుకలో ఉంచారు. అయితే 20వ శతాబ్దంలో క్రమంగా ఆ కళ అంతరించిపోయింది. ప్రస్తుతం గుజరాత్ లోని కచ్ ప్రాంతం నిరోనాలో ఒక కుటుంబం మాత్రమే ఈరకమైన ‘రోగన్ పెయింటింగ్‌’ కళాకృతులను తయారు చేస్తున్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసినప్పుడు, డెన్మార్క్ రాణి మార్గరితే 2కు మోదీ ఇటువంటి రోగన్ పెయింటింగ్‌’ కళాకృతులనే బహుమతిగా ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ జపాన్ ప్రధానికి ఇటువంటి విలువైన బహుమతిని మోదీ అందజేశారు.