యూపీ : కనౌజ్ దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది : ప్రధాని మోదీ

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 04:51 AM IST
యూపీ : కనౌజ్ దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది : ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘కనౌజ్ దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది.బాధిత కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని మోదీ ఓ ట్వీట్‌లో తెలిపారు.

కనౌజ్ జిల్లా దేవర్ మార్గ్ వద్ద 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఒక ట్రక్కును ఢీకొనడంతో రెండు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని 25 మంది ప్రయాణికులను కాపాడారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో 21 మందిని రక్షించి..ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 
యోగి సర్కార్ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఈ ప్రమాదంపై సీఎం యోగీ ఆదిత్యా నాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు.