Kerala : తను మార్నింగ్ వాకింగ్ చేయడానికి రోడ్​ బ్లాక్​ చేయించిన ఏసీపీ

తను మార్నింగ్ వాకింగ్ చేయడానికి రోడ్​ బ్లాక్​ చేయించాడు ఓ పోలీసు అధికారి.

Kerala : తను మార్నింగ్ వాకింగ్ చేయడానికి రోడ్​ బ్లాక్​ చేయించిన ఏసీపీ

Kochi Traffic Police Officer  Abuse Of Authority In Kerala (1)

Kochi traffic police officer  Abuse of authority in Kerala : కేరళలోని కొచ్చిలో ఓ పోలీసు అధికారి తను మార్నింగ్ వాకింగ్ చేయటం కోసం ఏకంగా ఆ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేయించాడు. రోడ్డు బ్లాక్ చేయటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాకింగ్ కోసం ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడతారా? అని ప్రశిస్తూ సదరు పోలీసుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయశారు. దీంతో ఏంటీ పని..ప్రజల కోసం పనిచేయాల్సినవారు ఆ ప్రజల్నే ఇబ్బందులకు గురి చేస్తావా? అని ఉన్నాధికారులు చీవాట్లు పెట్టి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కొచ్చి ట్రాఫిక్ వెస్ట్ జోన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న వినోద్ పిళ్లై క్వీస్ వాక్‌వేలో ప్రతి రోజు ఉదయం వాకింగ్ కు వస్తుంటారు. ప్రతి ఆదివారం ఉదయం6-7 గంటల వరకు పిల్లలు సైకిల్ తొక్కడం, స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఈ రహదారిని మూసివేస్తారు. కానీ వినోద్ పిళ్లై తన వాకింగ్ కోసం ఇతర రోజుల్లో కూడా ఆ రహదారిని బ్లాక్ చేయించారు. ఆయన మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా కులాసాగా వాకింగ్ చేస్తుంటారు. దీంతో ప్రజలు మండిపడ్డారు. రోడ్డు ఈయనగారి కోసమేనా? ఎంత అధికారం ఉంటేమాత్రం అంటూ మండిపడ్డారు.

గత మూడు రోజులుగా రోడ్డుపైకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డ స్థానికులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ మళ్లించిన ఫొటోలు, ఆ రోడ్డుకు అవతలి వైపు నుంచి పిల్లలను బస్సులు ఎక్కిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు ఏసీపీ నిర్వాకం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో, ఆయనకు నోటీసులు జారీ చేశారు.

కాగా..కొన్ని వారాల క్రితం ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి త‌న పెంపుడు కుక్కతో క‌లిసి ఈవినింగ్ వాకింగ్ చేయ‌డానికి ఓ స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించి బదిలీకి గురైన విషయం తెలిసిందే.