ఇదీ నిజం: 10 ఏళ్ల కాపురం తర్వాత మగాడని తెలిసింది

  • Published By: Subhan ,Published On : June 26, 2020 / 03:21 PM IST
ఇదీ నిజం: 10 ఏళ్ల కాపురం తర్వాత మగాడని తెలిసింది

ముప్పై సంవత్సరాలుగా సాధారణమైన జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళకు తన జీవితం గురించి అనుకోని షాక్ తగిలింది. కడుపునొప్పి అని హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత తాను స్త్రీ కాదని మగాడని డాక్టర్లు చెప్పారు. అతనికి టెస్టిక్యులర్ (వృషణాలకు సంబంధించిన) క్యాన్సర్ అని తెలిసింది. ”ఆండ్రోజన్ ఇన్‌సెన్సిటివీటీ సిండ్రోమ్” అని దాంతో పాటు పుట్టుకతోనే ఆ వ్యక్తి మగ కానీ, శరీర అవయవాలన్నీ ఆడవారిలాగే ఉన్నాయి. 

30ఏళ్ల బీర్‌భం వాసి అయిన మహిళకు వివాహం అయి తొమ్మిదేళ్లు అయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ హాస్పిటల్ లో రెండు నెలలుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుందంటూ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లింది. క్లినికల్ అంకాలజిస్ట్ డా.అనుపం దత్తా, సర్జికల్ అంకాలజిస్ట్ డా.సౌమెన్ దాస్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

‘కనిపించడానికి ఆమె స్త్రీలా కనిపిస్తూ.. గొంతు, రొమ్ములు, మర్మావయవం అన్ని శరీర భాగాలు మహిళలాగే ఉన్నాయి. ఆమెకు పుట్టుకతోనే గర్భాశయం, అండాశయం లేవు. తనకు జీవితంలో ఒక్కసారి కూడా నెలసరి రాలేదు’ అని డా.దత్తా అన్నారు. ఇది చాలా అరుదైన విషయం. ప్రతి 22వేల మందిలో ఒక్కరికి ఇలా బయటపడుతుందని అన్నారు. టెస్టు రిపోర్టులు చేసిన తర్వాత వ్యక్తికి బ్లైండ్ వెజైనా ఉందని తెలిసి కర్యోటైపింగ్ టెస్టు నిర్వహించారు. ఆమె క్రోమోజోములో అందరి స్త్రీలకు మాదిరి XX అని ఉండకుండా XYఅని ఉంది. 

కడుపులో నొప్పి అని తెలిసిన తర్వాత ఆమె శరీరంలో వృషణాలు ఉన్నట్లు అర్థమైంది. బయోప్సీ నిర్వహించాక ఆమెకు వృషణాల క్యాన్సర్ ఉన్నట్లు అర్థమైందని దీనిని సెమినోమా అంటారని డా.దత్తా అన్నారు. ‘ఈ వ్యక్తి మహిళగానే పెరిగింది. 10 సంవత్సరాల క్రితం ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు, భర్తకు కలిపి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మిగిలిన జీవితాన్ని హ్యాపీగా గడపాలని వారికి సూచించినట్లు తెలిపారు. పలు మార్లు పిల్లల కోసం ప్రయత్నించి ఫెయిలయ్యారు.