పులుల పరిరక్షణ కోసం దంపతుల భారత యాత్ర

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 04:56 AM IST
పులుల పరిరక్షణ కోసం దంపతుల భారత యాత్ర

దేశంలో పెద్ద పులుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని స్వంచ్ఛంధ సంస్థలు కూడా నడుం బిగించాయి. ప్రభుత్వాలు ఎన్ని చేసిన భారతదేశపు పులులను పరిరక్షణ కోసం ప్రజల్లో కూడా అవగాహన చాలా అవసరం. దీని కోసం కోల్ కతాకు చెందిన దంపతులు ఏకంగా  మోటర్ సైకిల్ పై భారతదేశ యాత్ర చేపట్టారు. 
 
రతీంద్రాదాస్, గీతాంజలి దంపతులు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరానికి చెందినవారు. దేశంలో అంతరించిపోతున్న పులులను పరిరక్షించాలనే తపనతో దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మోటర్ సైకిల్ పై భారత యాత్రకు శ్రీకారం చుట్టారు. రతీంద్రాదాస్ తన భార్య గీతాంజలితో కలిసి మోటారుసైకిలుపై దేశంలోని పులుల అభయారణ్యాల్లో తిరుగుతూ పులులను పరిరక్షించండి…పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. 

రతీంద్రాదాస్, గీతాంజలి కోల్‌కతా నగరంలో ఫిబ్రవరి 15న ‘జర్నీ ఫర్ టైగర్’ పేరుతో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ దంపతులు  మాట్లాడుతూ..తాము ఇప్పటికే  28 రాష్ట్రాలతో పాటు.., ఐదు కేంద్రపాలిత ప్రాంతాలల్లో అవగాహన కార్యక్రమాన్ని చేశామనీ తెలిపారు.  ఈ యాత్రలో పులుల గురించే కాక..ఇతర వన్యప్రాణులను పరిరక్షించాలని కూడా ప్రచారం చేస్తున్నామని రతీంద్రాదాస్, గీతాంజలి దంపతులు చెప్పారు. యాత్రలో భాగంగా  ఒడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ లోని సిమిలిపాల్ జాతీయ పార్కును సందర్శించారు. తమ టైగర్ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని రతీంద్రాదాస్, గీతాంజలిలు ఆనందం వ్యక్తంచేశారు. 

తమ  ‘జర్నీ ఫర్ టైగర్’ యాత్రలో భాగంగా ఒడిశాలోని మయూరభంజ్ లోని సిమిలిపార్ నేషనల్ పార్కుకు వెళుతున్నామని తెలిపారు.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (జి) ప్రకారం వన్యప్రానులు..మరి సహజ వనరులను పరిరక్షించటం భారత పౌరుల ప్రాథమిక కర్తవ్యం అని రతీంద్రా దాస్ తెలిపారు. 

ఈ యాత్రలో సెంచూరియా యూనివర్శిటీ విద్యార్ధలను కలిశారు ఈ దంపతులు. మెరుగైన జీవనం కోసం పర్యావరణాన్ని కాపాడాలని..ప్టాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని..చెట్లను నరికివేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. యువత  తలచుకుంటే జరగనిదంటూ ఉండదనీ పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలని వారికి తెలిపారు. మనిషి అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేసుకుంటూ పోతే ప్రాణవాయువు కరవై మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ పౌరుడిదీ నని ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని.. రతీంద్రాదాస్ దంపతులు  ‘జర్నీ ఫర్ టైగర్’ యాత్రలో ప్రచారం చేస్తున్నారు.