Shorts : షార్ట్స్ ధరించి బ్యాంకుకి వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం

'షార్ట్స్‌’ ధరించి ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాంకు సిబ్బంది అతడిని వెనక్కి పంపేశారు. ప్యాంటు ధరించి రావాలని చెప్పారు.

Shorts : షార్ట్స్ ధరించి బ్యాంకుకి వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం

Shorts Sbi

Shorts : ‘షార్ట్స్‌’ ధరించి ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాంకు సిబ్బంది అతడిని వెనక్కి పంపేశారు. ప్యాంటు ధరించి రావాలని చెప్పారు. తమ ఖాతాదారులు బ్యాంకు శాఖలో హుందాగా వ్యవహరించాలని తాము కోరుకుంటామని అక్కడి సిబ్బంది అతనికి చెప్పారు. కోల్ కతాకు చెందిన ఆశిష్‌ కు ఈ అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అతడు నవంబర్ 16న ట్విటర్‌ వేదికగా ఎస్బీఐ దృష్టికి తీసుకెళ్లాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. వినియోగదారులు ఎలాంటి దుస్తులు ధరించాలన్న దానిపై కచ్చితమైన నిబంధనలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌ వైరల్‌గా అయ్యింది. ఎస్‌బీఐపై అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలంటూ పలువురు కామెంట్ల రూపంలో సూచించారు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

దీంతో ఎస్‌బీఐ స్పందించింది. తమ బ్యాంకు శాఖలకు వచ్చే కస్టమర్లు ధరించే దుస్తులపై ఎలాంటి నియమ నిబంధనలు లేవని స్పష్టం చేసింది. వారి ఇష్టానికి అనుగుణంగా దుస్తులు ధరించొచ్చని తెలిపింది. అయితే, బ్యాంకు శాఖ ఉన్న ప్రాంతంలో ఆచరించే సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి.. అందరికీ ఆమోదనీయమైన దుస్తులు ధరించడం మేలని సూచించింది.

WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!

అయితే, తమ స్థానిక ఎస్‌బీఐ అధికారులు తమ ఇంటికి వచ్చారని.. సమస్య పరిష్కారం అయ్యిందని ఆశిష్‌ నవంబర్ 20న మరోసారి ట్వీట్‌ చేశాడు. ఇంతటితో ఈ సమస్యకు ముగింపు పలకాలనుకుంటున్నానని.. సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరాడు.