Final Goodbye : రావత్ దంపతుల చితాభస్మాన్ని గంగానదిలో కలిపిన కుమార్తెలు
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం(డిసెంబర్-8,2021)మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికల చితాభస్మాన్ని వారి కుమార్తెలు

Final Goodbye : తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం(డిసెంబర్-8,2021)మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి నిమిజ్జనం చేశారు.
రావత్ సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో శ్రాద్ధ కర్మలు నిర్వహించిన అనంతరం రావత్ దంపతుల చితాభస్మాన్ని గంగానదిలో కలిపేశారు. కుమార్తెలిద్దరూ( క్రితిక, తరిణి)తమ తల్లిదండ్రుల చితాభస్మాలుంచిన పాత్రలను పుష్పాలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. కాగా, హిందూ సంప్రదాయం ప్రకారం.. దహన సంస్కారాల తర్వాత చితాభస్మాన్ని పుణ్య నదుల్లో కలపుతారు.
శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల మధ్య, యావత్ దేశం కన్నీటి వీడ్కోల మధ్య రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. వారి కుమార్తెలు కృతిక, తరుణి కలిసి బిపిన్ దంపతుల చితికి నిప్పుపెట్టి చేశారు. ఈ సమయంలో సైనికులు 17 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం తెలిపారు.
బుధవారం మధ్యాహ్నాం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో రావత్ దంపతులతో పాటు మరో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.
ALSO READ Pinaka-ER : పినాక-ఈఆర్ రాకెట్ లాంచర్ ప్రమోగం విజయవంతం