కేరళ ఆర్టిసీ కొత్త ప్రాజెక్ట్ : మహిళా ప్రయాణికుల కోసం ‘స్టే సేఫ్‌’…

కేరళ ఆర్టిసీ కొత్త ప్రాజెక్ట్ : మహిళా ప్రయాణికుల కోసం ‘స్టే సేఫ్‌’…

Ksrtc `safe Stay' To Womens (1)

KSRTC `safe stay’ to womens : మహిళా ప్రయాణికుల కోసం కేరళ ఆర్టీసీ తాజా ప్రాజెక్టు ప్రారంభించింది.రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ‘స్టే సేఫ్‌’ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది‌. ఈ ప్రాజెక్టు ఉద్ధేశ్యం మహిళలను సేఫ్టీగా ఉంచటం. అంటే..సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళలు, వేళ గాని వేళ గమ్యం చేరుకున్న మహిళలు, సొంత పనులు మీద ఒంటరిగా వచ్చిన మహిళలు సేఫ్‌గా ఉండటానికి బస్టాండ్‌లలోనే రూములు తీసుకుని ఉండవచ్చు.

ఇటువంటి మహిళల కోసం కేరళలోని 94 డిపోల్లో ఏసి, నాన్‌ ఏసి గదులు తయారవుతున్నాయి. ఈ రూములు అందుబాటు ధరల్లోనే ఉంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మహిళా ప్రయాణికులకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరంగా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

గతంలో తిరువనంతపురంలో కేవలం మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే గెస్ట్‌హౌస్‌ను మొదలు పెట్టారు. మహిళలకు అవసరమైనవాటితో పాటు చంటి పిల్లలకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఓ స్టోర్‌ కూడా ఏర్పాటు చేశారు. వీటికి మంచి స్పందన రావటంతో ఇప్పుడు మహిళల కోసం బస్టాండ్‌లోనే గదులు నిర్మించే పనులు ప్రారంభించారు. మరో రకంగా చెప్పాలంటే ఇది కోవిడ్‌ సమయంలో మంచి ఆలోచన అని చెప్పొచ్చు. కరోనా మరోసారి పెరుగుతున్న క్రమంలో ప్రజలు ప్రయాణాలు చేయటం సాధ్యమైనంత వరకూ తగ్గించారు. దీంతో ప్రయాణీకుల సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి.

ప్రయాణాలు చేసే మహిళలకు తోడుగా వచ్చేవారు లేకున్నా..వారేమీ భయపడాల్సిన పనిలేదు. అలాగే కోవిడ్ వల్ల బస్టాండుల్లోకి ప్రయాణీకులను తప్ప తోడుగా వచ్చేవారిని రానివ్వకపోవటం వంటి పరిస్థితుల్లో మహిళల కోసం బస్టాండుల్లోనే రూములను నిర్మిస్తే వారు వాటిల్లో ఉండొచ్చు కదా అనే ఆలోచనకు ప్రతి రూపమే ఈ ‘స్టే సేఫ్టీ’.

మరో రకంగా చెప్పాలంటే కోవిడ్ సమయంలో ఈ ఆలోచన ఆదాయం పెంచుకునే మార్గంగా కూడా కేరళ ఆర్టీసీ భావిస్తోంది. వచ్చే పోయే బస్సులతో, ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్రాంగణాలలో గదులు మహిళలకు రక్షణ ఇస్తాయన్న విషయంలో ఎటువంటి డౌట్ పడాల్సిన పనిలేదంటున్నారు అధికారులు. హోటళ్ల కంటే ఈ ‘స్టే సేఫ్టీ’ రూమ్స్ చాలా సేఫ్టీ కూడా..అని మహిళా ప్రయాణికులు భావిస్తే రాబోయే రోజుల్లో ఈ బస్టాండ్‌ హోటళ్లు మహిళలతో నిండిపోయే అవకాశాలున్నాయి.